Covid 19 Vaccines in Regular Market: ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్(Coronavirus) నేపథ్యంలో.. భారత్‌లో వ్యాక్సినేషన్(Vaccination) ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ సమయంలో కోవిషీల్డ్(Covishield), కోవాగ్జిన్(Covaxin) టీకాల కంపెనీలు, రెగ్యులర్ మార్కెట్లోకి వచ్చేందుకు అప్రూవల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. రెగ్యులర్ మార్కెట్‌లోకి వచ్చిన వెంటనే ఈ రెండు కొవిడ్ వ్యాక్సిన్‌ల ధరలు భారీగా తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు వ్యాక్సిన్‌ల ధరలు ఒక్కో డోసు 275 రూపాయలుగా నిర్ధారణ కానున్నట్టు తెలుస్తోంది. అదనంగా సర్వీస్ ఛార్జీ మరో 150 రూపాయలతో మొత్తంగా 425 రూపాయలు ఉండొచ్చనే వార్తలు వస్తున్నాయి. వీటిపై నేషనల్ ఫార్మాసుటికల్స్ ప్రైసింగ్ అథారిటీ ధరల నియంత్రణ తగ్గింపు దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో కోవిడ్-19పై సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ కీలక సూచన చేసింది. కొన్ని షరతులకు లోబడి ఉపయోగించడానికి కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్‌లకు సాధారణ మార్కెట్లోకి పర్మిషన్ ఇవ్వాలని సిఫార్సు చేసింది. అలాగే ధరల నిర్ధారణపై NPPAను అభిప్రాయం కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో కోవాగ్జిన్ ధర ఒక డోస్‌కు 1200 రూపాయలుగా ఉండగా, కోవిషీల్డ్ ధర 780గా ఉంది. వీటికి అదనంగా 150 రూపాయలు సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ రెండు కూడా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉపయోగించేందుకు అనుమతులు ఉన్న వ్యాక్సిన్‌లే. అయితే, ఒకవేళ వ్యాక్సిన్‌కు మార్కెట్ ఆథరైజేషన్ లేబుల్ దక్కితే కేవలం అత్యవసర పరిస్థితులు, రిజర్వ్‌డ్ కండిషన్స్‌లో మాత్రమే విక్రయించాలనే నిబంధన ఉండదు. ఇక రెగ్యులర్ మార్కెట్‌లోకి ఈ టీకాలు వస్తే, వ్యాక్సిన్ తీసుకునే వారి సంఖ్య ఇంకా పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు నిపుణులు.
SEC of CDSCO has recommended for upgrade of covishield and covaxin status from restricted use in emergency situations to grant of new drug permission with conditions In adult population ,DCGI will evaluate the recommendations and give its decision.
— CDSCO_INDIA_INFO (@CDSCO_INDIA_INF) January 19, 2022
Read Also… Wigs: మార్కెట్లో విగ్‌లకు పెరుగుతున్న డిమాండ్.. తయారు చేయడానికి 6 నెలల సమయం.. పూర్తి వివరాలు..!