Covid 19 vaccination Drive: దేశంలో కరోనా (Corona Virus) కేసులు తగ్గుతున్నా కొవిడ్ వ్యాక్సినేషన్ ( ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. ఇప్పటివరకు సుమారు 180 కోట్లకు పైగా కొవిడ్ టీకాలు (Covid Vaccination) పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. కాగా కరోనా వైరస్ నుంచి పిల్లలకు రక్షణ కల్పించే దిశగా మరో ముందడుగు పడనుంది. ఇందులో భాగంగా బుధవారం (మార్చి 16) నుంచి దేశవ్యాప్తంగా 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని బయోలాజికల్ ఈ.లిమిటెడ్ సంస్థ తయారు చేసిన కోర్బివాక్స్ టీకాను పిల్లలకు ఇవ్వనున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నిబంధనల ప్రకారం 12, 13, 14 ఏళ్ల వయసున్న వారు ఈ కరోనా టీకా తీసుకోవచ్చు. అలాగే 60 ఏళ్లు దాటి రెండు కంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్నవారు కూడా బూస్టర్ డోసు వేయించుకోవచ్చు.
చిన్నారులు క్షేమంగా ఉంటేనే..
కాగా కోర్బివాక్స్ టీకా పంపిణీపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సోమవారం ట్వీట్ చేశారు. ‘చిన్నారులు క్షేమంగా ఉంటేనే దేశం క్షేమంగా ఉంటుంది. 12-14 ఏళ్ల వయసున్న వారు బుధవారం నుంచి కొవిడ్ టీకా తీసుకోవాలి. 2008, 2009, 2010లో జన్మించిన పిల్లలూ ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వాములు కావాలి’ అని కోరారు. కాగా 12–14 ఏళ్ల వయసున్న పిల్లలు దేశవ్యాప్తంగా 7.11 కోట్ల మంది ఉన్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు బయోలాజికల్ ఈ.లిమిటెడ్ సంస్థ 5 కోట్ల కోర్బివాక్స్ టీకా డోసులను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అందించింది.
बच्चे सुरक्षित तो देश सुरक्षित!
मुझे बताते हुए खुशी है की 16 मार्च से 12 से 13 व 13 से 14 आयुवर्ग के बच्चों का कोविड टीकाकरण शुरू हो रहा है।
साथ ही 60+ आयु के सभी लोग अब प्रिकॉशन डोज लगवा पाएँगे।
मेरा बच्चों के परिजनों व 60+ आयुवर्ग के लोगों से आग्रह है की वैक्सीन जरूर लगवाएँ।
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) March 14, 2022
Also Read:Govt of India: వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. ఉత్తర్వులు జారీ..
ఈ బ్లడ్ గ్రూపు ఉన్నవారు చాలా మందికి రోల్ మోడల్స్.. ప్రేమ.. పెళ్లి వీరి జీవితంలో ఎలా ఉంటాయంటే..
Vellampalli Srinivas: పవన్‌కు మాట్లాడే అర్హత లేదు.. జనసేనానీపై మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం..