Need for lockdown in state : కోవిడ్ మహమ్మారి దేశంలో కోరలు చాస్తోన్నవేళ ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు ఆయ రాష్ట్రాల్లో తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఏడాది కాలంగా కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యాపార, ఉద్యోగ, వాణిజ్యాలు తలకిందులైన సంగతి తెలిసిందే. ఇక, నిన్న దేశవ్యాప్తంగా కరోనా కేసులు లక్షదాటడం, ఇవాళ 97వేలకుపైగా కొత్త ఇన్ఫెక్షన్లు నమోదవడంతో హైకోర్టు తాజాగా సంచలన తీర్పు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు లేదా నాలుగు రోజులపాటు లాక్డౌన్ విధించాలని గుజరాత్ హైకోర్టు.. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
గుజరాత్‌లో 3 నుండి 4 రోజుల లాక్ డౌన్ విధించాల్సిన అవసరం ఉందని కోర్టు సూచించింది. ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో వారంతపు కర్ఫ్యూ విధించడం కూడా అవసరమని కోర్టు అభిప్రాయపడింది. కోవిడ్ మహమ్మారి మరింతగా రాష్ట్రంలో విస్తరించకుండా నిబంధనలను కఠినంగా పాటించాల్సిన అవసరాన్ని కూడా కోర్టు ఎత్తి చూపింది. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ, సామాజిక కార్యక్రమాలను రద్దు చేయాలని గుజరాత్ ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. ప్రధాన న్యాయమూర్తి విక్రమ్ నాథ్, జస్టిస్ భార్గవ కరియాలతో కూడిన ధర్మాసనం గుజరాత్ ప్రభుత్వాన్ని ఈ మేరకు ఆదేశించింది.
Read also : పవన్ ఓ అద్దె మైకులా తయారయ్యారు.. తిరుపతి ప్రచారంపై వైసీపీ మంత్రుల ముప్పేటదాడి
కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై వర్క్ ప్లేస్‌లలోనూ కోవిడ్ వ్యాక్సినేషన్‌కు అనుమతి.!
పట్టరాని కోపంతో ఊగిపోయిన బుడతడు.. ఏం చేసాడో తెలిస్తే షాక్ అవుతారు..