కరోనా సెకండ్ వేవ్ మొదలైంది.. జాగ్రత్తగా ఉండండి: కర్ణాటక మంత్రి హెచ్చరిక

| Edited By: Ravi Kiran

Mar 22, 2021 | 10:10 AM

Covid-19 Second wave: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో 30వేల కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే

కరోనా సెకండ్ వేవ్ మొదలైంది.. జాగ్రత్తగా ఉండండి: కర్ణాటక మంత్రి హెచ్చరిక
Coronavirus Second Wave In Karnataka
Follow us on

Covid-19 Second wave: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో 30వేల కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఉద్ధవ్ ప్రభుత్వం పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ ప్రకటించడంతోపాటు నైట్ కర్ఫ్యూను సైతం అమలు చేస్తోంది అయినప్పటకీ రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కె. సుధాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైపోయిందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. ఈ మేరకు సుధాకర్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా ప్రజలందరూ అప్రమత్తతో మెలగాలని, లేదంటే మరోసారి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఆయన హెచ్చరించారు. నిపుణుల హెచ్చరికలను పెడచెవిన పెడితే ఆ తర్వాత ఎదురయ్యే పరిస్థితులకు ప్రజలు, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ సుధాకర్ స్పష్టం చేశారు.

కరోనాపై పోరాటంలో రానున్న మూడు నెలలు కీలకం కానున్నాయని సుధాకర్ పేర్కొన్నారు. వైరస్‌ను నియంత్రించేందుకు మనమంతా చేతులు కలపాలని, దీనికి ప్రజల సహాకారం అవసరమని పేర్కొన్నారు. కరోనా నిబంధనలను పాటించాలని సూచించారు. మాస్కులు లేకుండా బయట తిరిగే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలాఉంటే.. రాష్ట్రంలో పెరుగుతున్న కేసులతో బీఎస్ యడియూరప్ప ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ను నియంత్రించేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు సైతం విధించింది. బెంగళూరు, బీదర్ లాంటి పట్టణాల్లో కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. నైట్ పార్టీలను, సామూహిక కార్యక్రమాలను నిషేధించారు. కాగా గత 24 గంటల్లో కర్ణాటక రాష్ట్రంలో 1,715 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

Also Read:

Students Drown: విషాదం నింపిన సరదా.. సముద్రంలో స్నానానికి వెళ్లి విద్యార్థుల గల్లంతు.. ఇద్దరు మృతి