భార‌త్‌లో పెరుగుతున్న వైర‌స్ మ‌ర‌ణాలు

దేశంలో క‌రోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అంతర్జాతీయ స్థాయిలో నిపుణులు అంచనా వేసినట్లే ఇండియాలో కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా అర్థరాత్రి ఓ మరణం సంభవించడంతో...

భార‌త్‌లో పెరుగుతున్న వైర‌స్ మ‌ర‌ణాలు
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 25, 2020 | 6:18 AM

దేశంలో క‌రోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అంతర్జాతీయ స్థాయిలో నిపుణులు అంచనా వేసినట్లే ఇండియాలో కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా అర్థరాత్రి ఓ మరణం సంభవించడంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 11కి చేరింది.

భార‌త్ క‌రోనా మ‌ర‌ణ‌మృదంగం మోగిస్తోంది. పెరిగిపోతున్న వైర‌స్ మ‌ర‌ణాలు వ‌ణుకుపుట్టిస్తున్నాయి. దేశ‌వ్యాప్తంగా విస్త‌రించిన వైర‌స్ కార‌ణంగా తమిళనాడు మధురైలోని రాజాజీ ఆస్పత్రిలో క‌రోనా వైర‌స్ కు చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మ‌ర‌ణించాడు. ఐతే… ఆ వ్యక్తికి సుదీర్ఘ కాలంగా స్టెరాయిడ్ ఆధారిత COPD అనే అనారోగ్య సమస్య ఉంది. దాంతోపాటూ డయాబెటిస్, హైపర్ టెన్షన్ కూడా ఉన్నాయని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ఇన్ని వ్యాధులతో బాధపడుతున్నారు కాబట్టే మరణం సంభవించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఇండియాలో 566 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 515 మంది వైరస్ సమస్యతో బాధపడుతున్నారు. 40 మంది మాత్రం వైరస్ నుంచీ కోలుకున్నారు. దావానంలా వ్యాపిస్తున్న మహమ్మారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్ర‌ధాని మోదీ మ‌రో మూడు వారాల పాటు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ప‌గ‌విప్పుతోన్న క‌రోనాను క‌ట్ట‌డి చేయాలంటే..స్వీయ నియంత్ర‌ణ ఒక్క‌టే మార్గంగా ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు ప్ర‌ధాని మోదీ.