కరోనా ఉండేది రెండేళ్లే.. త్వరగానే మహమ్మారి నుంచి విముక్తి

ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్ని పట్టిపీడిస్తోన్న కోవిడ్ మహమ్మారి రెండేళ్లకు మించి ప్రభావం చూపకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. స్పానిష్ ఫ్లూలాగా ఎక్కువ కాలం ఇది ఉండకపోవచ్చని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ అదనమ్ టెడ్రోస్ గాబ్రియేసుస్..

కరోనా ఉండేది రెండేళ్లే.. త్వరగానే మహమ్మారి నుంచి విముక్తి
TV9 Telugu Digital Desk

| Edited By: Team Veegam

Sep 15, 2020 | 7:02 PM

ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్ని పట్టిపీడిస్తోన్న కోవిడ్ మహమ్మారి రెండేళ్లకు మించి ప్రభావం చూపకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. స్పానిష్ ఫ్లూలాగా ఎక్కువ కాలం ఇది ఉండకపోవచ్చని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ అదనమ్ టెడ్రోస్ గాబ్రియేసుస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ రెండు సంవత్సరాల్లోపే అంతమైపోతుందని నమ్ముతున్నాం. 1918లో ప్రపంచాన్ని వణికించిన ప్రాణాంతక స్పానిష్ ఫ్లూలాగా ఈ కోవిడ్-19 ఎక్కువ కాలం ఉండదన్నారు. ప్రపంచీకరణ వల్ల భూగోళంపై ప్రతి మూలకు సంబంధాలు ఏర్పడటంతోనే కరోనా వ్యాప్తి త్వరగా జరిగింది. నేటి ప్రపంచానికి ఇదో ప్రతికూలాంశం. అయినప్పటికీ ఇప్పుడున్న సౌకర్యాలను ఉపయోగించుకొంటే స్పానిష్ ఫ్లూ కంటే తక్కువ కాలంలోనే ఈ వైరస్‌ను అంతం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.

Read More:

డబ్బులు కావాలంటే కాల్ చేయండి.. ఏటీఎం ఇంటికే వచ్చేస్తుంది

నిరుద్యోగుల కోసం గూగుల్ ఉపాధి కోర్సులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి.. 2.35 కోట్లకి చేరిన కేసులు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu