తొలి దశలో..5 రాష్ట్రాలకు కొవిడ్-19 డ్రగ్

కరోనా వైరస్ నివారణకు తోడ్పడే 'రెమ్ డెసివిర్' మెడిసిన్ ని తొలిదశలో అయిదు రాష్ట్రాలకు సరఫరా చేయనున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీతో బాటు గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఈ మందును పంపుతున్నట్టు దీని తయారీ సంస్థ 'హెటిరో' కంపెనీ..

తొలి దశలో..5 రాష్ట్రాలకు కొవిడ్-19 డ్రగ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 25, 2020 | 4:39 PM

కరోనా వైరస్ నివారణకు తోడ్పడే ‘రెమ్ డెసివిర్’ మెడిసిన్ ని తొలిదశలో అయిదు రాష్ట్రాలకు సరఫరా చేయనున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీతో బాటు గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఈ మందును పంపుతున్నట్టు దీని తయారీ సంస్థ ‘హెటిరో’ కంపెనీ ప్రకటించింది. హైదరాబాద్ లోని ఈ సంస్థ ‘కోవిఫర్’ బ్రాండ్ పేరిట దీన్ని నిన్న విడుదల చేసింది. ఈ రాష్ట్రాలకు 20 వేల వైల్స్ చొప్పున ఈ మెడిసిన్ ని పంపుతున్నామని, 100 మిల్లీగ్రాముల వైల్ ఖరీదు 5,400 రూపాయలని ఈ డ్రగ్స్ కంపెనీ వివరించింది. మూడు నాలుగు వారాల్లో లక్ష వైల్స్ ని తయారు చేయాలన్నది ఈ సంస్థ లక్ష్యం.ఇక రెండో దశలో ఈ మెడిసిన్ ని విజయవాడ, కోల్ కతా, ఇండోర్, భోపాల్, లక్నో, పాట్నా, భువనేశ్వర్, రాంచీ, కోచి, త్రివేండ్రం నగరాలకు, గోవా రాష్ట్రానికి సరఫరా చేస్తామని ఈ సంస్థ వర్గాలు వివరించాయి. కాగా ఈ మందు ప్రభుత్వం ద్వారా లేదా ఆస్పత్రుల ద్వారా మాత్రమే లభ్యమవుతుందని, రిటైల్ గా కాదని ఈ సంస్థ స్పష్టం చేసింది. అటు-సిప్లా  కంపెనీ కూడా రెమ్ డెసివిర్ మందును మరో బ్రాండ్ పేరిట ఉత్పత్తి చేస్తోంది. ఈ రెండు కంపెనీలకు భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి దీని తయారీకి, పంపిణీకి అనుమతి లభించింది.