తండ్రికి కూతురితో త‌ల‌కొరివి పెట్టించిన క‌రోనా..

|

Mar 24, 2020 | 3:08 PM

క‌రోనా ప్రపంచ వ్యాప్తంగా చెల‌రేగిపోతుంది. ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ ప్ర‌భావంతో రోజురోజుకు మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతోంది. ఇండియాలో కూడా ఈ డేంజ‌ర‌స్ రోజురోజుకు పేట్రోగిపోతుంది. అయితే దీని కొన్ని ఊహించ‌ని స‌న్నివేశాల‌ను కూడా చూడాల్సి వ‌స్తుంది. తాజాగా ఏపీలోని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన తొండపు గోపాల్‌రావు అనే వ్యక్తి అనారోగ్య కార‌ణాల‌తో మృతి చెందాడు. అత‌డికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు వెంకటరామ ప్రసాద్ యూఎస్ లో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ గా ప‌నిచేస్తున్నాడు. […]

తండ్రికి కూతురితో త‌ల‌కొరివి పెట్టించిన క‌రోనా..
Follow us on

క‌రోనా ప్రపంచ వ్యాప్తంగా చెల‌రేగిపోతుంది. ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ ప్ర‌భావంతో రోజురోజుకు మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతోంది. ఇండియాలో కూడా ఈ డేంజ‌ర‌స్ రోజురోజుకు పేట్రోగిపోతుంది. అయితే దీని కొన్ని ఊహించ‌ని స‌న్నివేశాల‌ను కూడా చూడాల్సి వ‌స్తుంది.

తాజాగా ఏపీలోని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన తొండపు గోపాల్‌రావు అనే వ్యక్తి అనారోగ్య కార‌ణాల‌తో మృతి చెందాడు. అత‌డికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు వెంకటరామ ప్రసాద్ యూఎస్ లో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ గా ప‌నిచేస్తున్నాడు. తండ్రి మరణ వార్త తెలిసినా… కరోనా దృష్ట్యా ఇంట‌ర్నేష‌నల్ విమాన సర్వీసులు నిలిపివేసిన నేప‌థ్యంలో రద్దయిన పరిస్థితుల్లో కొడ‌కు సొంతూరుకు రాలేకపోయాడు. దీంతో త‌ప్ప‌నిస‌రి పరిస్థితుల్లో.. కుమార్తె లక్ష్మి.. తండ్రికి అంత్యక్రియలు నిర్వహించింది.