AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covaxin: భారత్ బయోటెక్ ‘కొవాక్జిన్’ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం.. మొత్తం ఎంతమందిపై జరిపారంటే..?

Bharat Biotech Covaxin Phase 3 Trials: భారత ఫార్మ దిగ్గజం.. హైదరాబాద్ సంస్థ భారత్‌ బయోటెక్‌ కరోనావైరస్ వ్యాక్సిన్ పరంగా మరో ముందడుగు వేసింది. భారత్‌ బయోటెక్‌ కోవిడ్ వ్యాక్సిన ‘కొవాగ్జిన్‌' మూడో దశ..

Covaxin: భారత్ బయోటెక్ ‘కొవాక్జిన్’ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం.. మొత్తం ఎంతమందిపై జరిపారంటే..?
Covaxin Phase 3 Trials
Shaik Madar Saheb
|

Updated on: Mar 04, 2021 | 12:13 PM

Share

Bharat Biotech Covaxin Phase 3 Trials: భారత ఫార్మ దిగ్గజం.. హైదరాబాద్ సంస్థ భారత్‌ బయోటెక్‌ కరోనావైరస్ వ్యాక్సిన్ పరంగా మరో ముందడుగు వేసింది. భారత్‌ బయోటెక్‌ కోవిడ్ వ్యాక్సిన ‘కొవాగ్జిన్‌’ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతమయ్యాయి. ఈ మేరకు సంస్థ ఫలితాలను బుధవారం వెల్లడించింది. 18-98 మధ్య వయస్సు ఉన్న మొత్తం 25,800 మందిపై కొవాగ్జిన్ వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించినట్లు భారత్ బయోటెక్ పేర్కొంది. ఈ ట్రయల్స్‌లో టీకా మధ్యంతర క్లినికల్‌ సామర్థ్యం 80.6 శాతంగా నమోదైనట్టు సంస్థ తెలిపింది. అయితే ఇంతమంది వలంటీర్లపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడం దేశంలోనే ఇది తొలిసారని పేర్కొంది.

మూడో దశ ట్రయల్స్‌లో పాల్గొన్న మొత్తం వలంటీర్లలో 2,433 మంది 60 ఏళ్లు పైబడిన వారున్నారని భారత్ బయోటెక్ తెలిపింది. వీరిలో 4,500 మందికి ఇతర ఆరోగ్య సమస్యలున్నట్టు సంస్థ వెల్లడించింది. మొదటి రెండు దశల క్లినికల్‌ ట్రయల్స్‌తో పోలిస్తే, మూడో దశలో టీకా ఫలితాలు బాగా మెరుగైనట్లు వెల్లడించింది. కొవాగ్జిన్ రెండో డోస్‌ ఇచ్చిన తర్వాత వాలంటీర్లకు ఎటువంటి ఇన్‌ఫెక్షన్లు సోకలేదని, ఎలాంటి సమస్యలు కూడా తలెత్తలేదని ప్రకటించింది.

కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్‌ ‘కొవాగ్జిన్‌’ మూడో దశ ట్రయల్స్‌లో 80.6 శాతం సమర్థతను చూపించిందని భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌, ఎండీ కృష్ణ ఎల్ల తెలిపారు. బ్రిటన్‌లో కనుగొన్న కొత్త కరోనా స్ట్రెయిన్‌తో పాటు వేగంగా వృద్ధి చెందుతున్న ఇతర కరోనా స్ట్రేయిన్లకు వ్యతిరేకంగా తమ టీకా రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంపొందిస్తుందని, ఎలాంటి అనుమానాలు అవసరం లేదని పేర్కొన్నారు.

కొవాగ్జిన్‌ మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా కొందరికి టీకాను ఇచ్చి పరిశోధనలు జరిపారు. మరికొందరికి కేవలం గ్లూకోజ్‌లాంటి ఇంజెక్షన్‌ను ఇచ్చి పరిశీలించారు. టీకా ఇచ్చిన అందరిలో ప్రతిరక్షకాలు ఉత్పత్తయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒకవైపు అత్యవసర వినియోగం కింద వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుండగానే.. టీకా సామర్థ్యాన్ని మరింత పెంచడానికి భారత్‌ బయోటెక్‌ సంస్థ భారీ ఎత్తున మూడవ దశ ప్రయోగాలు జరిపి విజయవంతమైంది.

Also Read:

Corona: దేశవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. నిన్న వైరస్ నుంచి ఎంత మంది కోలుకున్నారంటే..?

TRANSCO: తెలంగాణ ట్రాన్స్‌‌కోపై డ్రాగన్ హ్యాకర్ల కన్ను.. అప్రమత్తతతో కుట్రను అడ్డుకున్న అధికారులు

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..