కేరళలో 4 కేసులు.. తమిళనాడులో 121 కేసులు..
కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కేరళలో కొత్తగా మరో నాలుగు కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కరోనా కేసులు మాత్రం క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం రోజు.. కొత్తగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు.. ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 485కి చేరింది. ఇక తమిళనాడులో కూడా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య […]

కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కేరళలో కొత్తగా మరో నాలుగు కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కరోనా కేసులు మాత్రం క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం రోజు.. కొత్తగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు.. ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 485కి చేరింది.
ఇక తమిళనాడులో కూడా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో రెండు వేల మార్క్ దాటింది. తాజాగా.. మంగళవారం 121 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,058కి చేరింది. ఈ విషయాన్ని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు 1,128 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు.