రష్యాలో కరోనా విళయ తాండవం.. రికార్డ్ స్థాయిలో కేసుల నమోదు..
ప్రపంచ దేశాలన్నింటిని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. అన్ని దేశాలను ఇది టచ్ చేసింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ముప్పై లక్షల మందికి ఈ వైరస్ సోకింది. అంతేకాదు.. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే దాదాపు రెండు లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది లక్షల మంది వరకు ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ఈ వైరస్ రష్యాలో కూడా ఎంటర్ అయి అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే రష్యాలో దాదాపు తొంబై వేల మందికి […]

ప్రపంచ దేశాలన్నింటిని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. అన్ని దేశాలను ఇది టచ్ చేసింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ముప్పై లక్షల మందికి ఈ వైరస్ సోకింది. అంతేకాదు.. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే దాదాపు రెండు లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది లక్షల మంది వరకు ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ఈ వైరస్ రష్యాలో కూడా ఎంటర్ అయి అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే రష్యాలో దాదాపు తొంబై వేల మందికి పైగా ఈ మహమ్మారి బారినపడ్డారు. మంగళవారం ఒక్కరోజే…6,411 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని రష్యాకు చెందిన కరోనా వైరస్ క్రైసిస్ రెస్పాన్స్ కేంద్రాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు ఒక్కరోజులో నమోదైన కేసుల వివరాల్లో ఇవే అత్యధికమని అధికారులు వెల్లడించారు. రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో.. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం నమోదైన కేసులతో.. రష్యాలో మొత్తం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 93,558కి చేరింది. ఇక ఇప్పటి వరకు ఇక్కడ 867 మంది ప్రాణాలు కోల్పోయారు.