అమెరికాలో కరోనా కరాళనృత్యం.. 10 లక్షలకు చేరువైన కేసులు..
కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. అమెరికాలో కరోనా కేసులు 10 లక్షలకు చేరువ అవుతున్నాయి. 18 రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపు కావడం అక్కడి పరిస్థితి తీవ్రతకు

US Coronavirus Cases: కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. అమెరికాలో కరోనా కేసులు 10 లక్షలకు చేరువ అవుతున్నాయి. 18 రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపు కావడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో మూడొంతులు ఒక్క అమెరికాలోనే నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ కారణంగా అమెరికాలో ఇప్పటి వరకు 56 వేల మంది మరణించారు.
కాగా.. రోజుకు 2 వేల మంది ప్రాణాలు కోల్పోయారన్నమాట. పబ్లిక్ హెల్త్ అధికారులు, శిక్షణ పొందిన కార్యకర్తలు, మెటీరియల్ వంటివి పరీక్షల సామర్థ్యాన్ని పరిమితం చేశాయి. లేదంటే మరిన్ని కేసులు వెలుగు చూసి ఉండేవని నిపుణులు చెబుతున్నారు. ఇక, అమెరికాలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో ఒక్క న్యూయార్క్‌లోనే 30 శాతం కేసులు నమోదవుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో న్యూజెర్సీ, మాసాచుసెట్స్, కాలిఫోర్నియా, పెన్సిల్వేనియాలు ఉన్నాయి.