నేటి నుంచి ఉచిత రేషన్.. ఇవీ మార్గదర్శకాలు
కరోనా, లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేక అవస్థలు పడుతున్న నిరుపేదలను ఆదుకునేందుకు గానూ ఏపీ ప్రభుత్వం ఉచిత రేషన్ సరుకల పంపిణీ చేపట్టింది. ఇప్పటికే రెండు విడతల ఉచిత రేషన్ సరుకుల పంపిణీ పూర్తి చేశారు. బుధవారం(ఏప్రిల్ 29) నుంచి మే 10 వరకు మూడో విడత కార్యక్రమం మొదలు పెట్టారు. ఈ మేరకు ఇప్పటికే సరుకులు రేషన్ షాపులకు చేరుకున్నాయి. రాష్ట్రంలో కొన్ని వెసులుబాట్లతో లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో… సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో… […]

కరోనా, లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేక అవస్థలు పడుతున్న నిరుపేదలను ఆదుకునేందుకు గానూ ఏపీ ప్రభుత్వం ఉచిత రేషన్ సరుకల పంపిణీ చేపట్టింది. ఇప్పటికే రెండు విడతల ఉచిత రేషన్ సరుకుల పంపిణీ పూర్తి చేశారు. బుధవారం(ఏప్రిల్ 29) నుంచి మే 10 వరకు మూడో విడత కార్యక్రమం మొదలు పెట్టారు. ఈ మేరకు ఇప్పటికే సరుకులు రేషన్ షాపులకు చేరుకున్నాయి.
రాష్ట్రంలో కొన్ని వెసులుబాట్లతో లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో… సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో… పేదలకు మూడోసారి రేషన్ సరుకుల పంపిణీ జరుగుతోంది. అయితే, కరోనా తీవ్రత నేపథ్యంలో సరుకుల పంపిణీ, లబ్ధిదారులు పాటించాల్సిన నియమామలపై పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్…. రెవెన్యూ అధికారులు, డీలర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు. వాటిని తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆదేశించారు. ఇక ఈ సారి ఉచిత సరుకులు తీసుకునే లబ్ధిదారులకు బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు.
అధికారులు నిర్ధేశించిన మార్గదర్శకాలు :
– ఏప్రిల్ 29 నుంచి మే 10 వరకు రేషన్ దుకాణాల ద్వారా ఉచిత సరుకుల పంపిణీ ఉంటుంది.
– ఒక్కో దుకాణం పరిధిలో రోజుకు 30 మంది లబ్ధిదారుల చొప్పున టైమ్‌స్లాట్ విధానంలో టోకెన్లు పంపిణీ చేశారు.
– కరోనా నిబంధనలను పాటిస్తూ… సోషల్ డిస్టాన్స్ పాటిస్తూ రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది.
– అన్ని రేషన్ షాపులు, అదనపు కౌంటర్ల వద్ద శానిటైజర్లు, మాస్కులు, సబ్బులు, నీళ్లు అందుబాటులో ఉంచారు.
– రేషన్ అందకపోయినా, ఇతర ఇబ్బందులు ఉంటే 1902 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.
