కొంపముంచిన వన్ బై టూ ఛాయ్… గుంటూరులో ఏకంగా 100 మందికి..

|

May 01, 2020 | 5:20 PM

ఇద్దరు స్నేహితులు కలిసి తాగిన వన్ బై టూ ఛాయ్ అందరి కొంప ముంచింది. వారి వల్ల ఆ ప్రాంతంలో ఉండే 100 మందికి కరోనా సోకింది. ఇది వినడానికి కొంచెం విడ్డూరంగా ఉన్నా.. గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో కరోనా వ్యాప్తి చెందడానికి ఇదే కారణం. అసలు విషయం ఏంటంటే.. గత నెల 7వ తేదీన పట్టణానికి చెందిన ఓ కేబుల్ ఆపరేటర్ తీవ్ర అస్వస్థతతో గుంటూరు ఫీవర్ ఆసుపత్రికి వచ్చాడు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ […]

కొంపముంచిన వన్ బై టూ ఛాయ్... గుంటూరులో ఏకంగా 100 మందికి..
Follow us on

ఇద్దరు స్నేహితులు కలిసి తాగిన వన్ బై టూ ఛాయ్ అందరి కొంప ముంచింది. వారి వల్ల ఆ ప్రాంతంలో ఉండే 100 మందికి కరోనా సోకింది. ఇది వినడానికి కొంచెం విడ్డూరంగా ఉన్నా.. గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో కరోనా వ్యాప్తి చెందడానికి ఇదే కారణం. అసలు విషయం ఏంటంటే.. గత నెల 7వ తేదీన పట్టణానికి చెందిన ఓ కేబుల్ ఆపరేటర్ తీవ్ర అస్వస్థతతో గుంటూరు ఫీవర్ ఆసుపత్రికి వచ్చాడు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 9వ తేదిన చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో కేబుల్ ఆపరేటర్‌కు ఏవిధంగా వైరస్ సోకిందన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టగా పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.

కేబుల్ ఆపరేటర్ స్నేహితుడు మర్కాజ్‌కు వెళ్లి వచ్చాడు. వీరిద్దరూ కూడా మార్చి 23వ తేదిన కలిసి టీ సేవించారు. ఆ తర్వాతే కేబుల్ ఆపరేటర్‌కు పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. వరవకట్టకు చెందిన సదురు కేబుల్ ఆపరేటర్ కారణంగా ఆ ప్రాంతంలో 50కి పైగా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా అతడి ఇంటి పక్కన నివసించే హోంగార్డుకు ఏప్రిల్ 14న కరోనా పాజిటివ్‌గా తేలింది. హోంగార్డు పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక ఆ ఆసుపత్రిలో నలుగురు డాక్టర్లతో సహా 20 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీనితో అధికారులు అందర్నీ క్వారంటైన్‌లో ఉంచారు. కాగా, నరసరావుపేటలో మొత్తం 105 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Read This: ప్రభుత్వం కీలక నిర్ణయం.. మే 4 నుంచి మద్యం షాపులు ఓపెన్.!