సింగపూర్‌లో 35వేలకు చేరువలో కరోనా కేసుల సంఖ్య..

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని గజగజ వణికిస్తోంది. ఇప్పటికే అరవై లక్షల మందికి పైగా కరోనా సోకింది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులతో పాటు… మరణాలు కూడా ఇక్కడే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక అమెరికా తర్వాత.. యూరప్‌ దేశాల్లో కూడా ఈ మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇక మన సమీప దేశమైన సింగపూర్‌లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 518 కరోనా పాజిటివ్ కేసులు […]

సింగపూర్‌లో 35వేలకు చేరువలో కరోనా కేసుల సంఖ్య..
singapore
Follow us

| Edited By:

Updated on: May 31, 2020 | 6:34 PM

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని గజగజ వణికిస్తోంది. ఇప్పటికే అరవై లక్షల మందికి పైగా కరోనా సోకింది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులతో పాటు… మరణాలు కూడా ఇక్కడే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక అమెరికా తర్వాత.. యూరప్‌ దేశాల్లో కూడా ఈ మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇక మన సమీప దేశమైన సింగపూర్‌లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 518 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు సింగపూర్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు సింగపూర్‌లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 34,884కి చేరింది. అయితే తాజాగా నమోదైన కేసుల్లో ఎక్కువ మంది విదేశాల నుంచి వచ్చిన వారి దగ్గర పనిచేస్తున్న వారికే సోకినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు వెయ్యికి లోపే కేసులు నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. గత మే నెలలో కొన్ని వ్యాపార సంస్థలకు తిరిగి తెరవడానికి అనుమతులిచ్చామని.. ఇక జూన్‌ 2వ తేదీ నుంచి కరోనా కట్టడి కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Latest Articles
మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా? మీ ఇంట్లో ఏసీ పేలవచ్చు..జాగ్రత్త
మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా? మీ ఇంట్లో ఏసీ పేలవచ్చు..జాగ్రత్త
అరెరే.! హార్దిక్ స్థానం ఇక గల్లంతే.. నయా ఆల్‌రౌండర్ వచ్చేశాడుగా..
అరెరే.! హార్దిక్ స్థానం ఇక గల్లంతే.. నయా ఆల్‌రౌండర్ వచ్చేశాడుగా..
పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా దూకుడు.. రేసు నుంచి ముంబై ఔట్
పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా దూకుడు.. రేసు నుంచి ముంబై ఔట్
రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..
రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..
తీవ్రమైన అనారోగ్యం లేకుండా 50 ఏళ్లు ఆస్పత్రిలోనే గడిపిన వ్యక్తి..
తీవ్రమైన అనారోగ్యం లేకుండా 50 ఏళ్లు ఆస్పత్రిలోనే గడిపిన వ్యక్తి..
115 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన శాపగ్రస్త ఓడ.. మళ్లీ తెరపైకి
115 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన శాపగ్రస్త ఓడ.. మళ్లీ తెరపైకి
లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణ కుటుంబ సభ్యులకు బిగుస్తున్న ఉచ్చు!
లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణ కుటుంబ సభ్యులకు బిగుస్తున్న ఉచ్చు!
సమ్మర్‌లో మీ ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిపోతోంది.. ఈ పరికరంతో..
సమ్మర్‌లో మీ ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిపోతోంది.. ఈ పరికరంతో..
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??