ఏపీలో మ‌రో మూడు క‌రోనా పాజిటివ్‌..164కు చేరిన కేసుల సంఖ్య‌

ఏపీలో క‌రోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతున్నాయి. శుక్ర‌వారం రాత్రి మ‌రో మూడు వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతోమొత్తం కోవిడ్-19 వైర‌స్ బాధితుల సంఖ్య 164కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ కేసుల్లో కూడా ఎక్కువ ఢిల్లీ ప్రార్థనకు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులే ఉన్నారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు 161గా పాజిటివ్ కేసుల సంఖ్య సాయంత్రానికి పెరిగింది. రాత్రివ‌ర‌కు వ‌చ్చిన […]

ఏపీలో మ‌రో మూడు క‌రోనా పాజిటివ్‌..164కు చేరిన కేసుల సంఖ్య‌

Updated on: Apr 04, 2020 | 6:41 AM

ఏపీలో క‌రోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతున్నాయి. శుక్ర‌వారం రాత్రి మ‌రో మూడు వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతోమొత్తం కోవిడ్-19 వైర‌స్ బాధితుల సంఖ్య 164కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ కేసుల్లో కూడా ఎక్కువ ఢిల్లీ ప్రార్థనకు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులే ఉన్నారు.
శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు 161గా పాజిటివ్ కేసుల సంఖ్య సాయంత్రానికి పెరిగింది. రాత్రివ‌ర‌కు వ‌చ్చిన మ‌రికొన్నిన‌మూనాల‌కు సంబంధించి నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో తూర్పు గోదావరి జిల్లాలో రెండు, విశాఖపట్నంలో ఒక కరోనా పాజిటివ్ నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 164కు చేరుకున్నాయి.