షాకింగ్: కరోనా వ్యాక్సిన్ ప్రయోగం విఫలం.. ఇక కష్టమేనా!

కరోనా.. కరోనా.. కరోనా.. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ఈ మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. ఎప్పుడు? ఎలా? ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందోనని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు లండన్ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ.. ఆస్ట్రాజెనక అనే ఫార్మా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ChAdOx1 nCoV-19 అనే కరోనా వ్యాక్సిన్‌పై ప్రస్తుతం వర్సిటీ ప్రయోగాలు చేస్తోంది. ఇటీవల ఈ మందును కోతులపై ప్రయోగించింది. […]

షాకింగ్: కరోనా వ్యాక్సిన్ ప్రయోగం విఫలం.. ఇక కష్టమేనా!
Follow us

|

Updated on: May 20, 2020 | 3:42 PM

కరోనా.. కరోనా.. కరోనా.. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ఈ మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. ఎప్పుడు? ఎలా? ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందోనని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు లండన్ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ.. ఆస్ట్రాజెనక అనే ఫార్మా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ChAdOx1 nCoV-19 అనే కరోనా వ్యాక్సిన్‌పై ప్రస్తుతం వర్సిటీ ప్రయోగాలు చేస్తోంది.

ఇటీవల ఈ మందును కోతులపై ప్రయోగించింది. అయితే కోతుల్లో ప్రయోగించిన ఈ మెడిసిన్ విఫలం అయ్యింది. కోతుల్లో కేవలం ఈ వ్యాక్సిన్ న్యుమోనియాను మాత్రమే అపగలిగింది గానీ.. కరోనా సంక్రమణ తీవ్రతను తగ్గించలేకపోయింది. దీనితో ఈ వ్యాక్సిన్‌పై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఈ పరిశోధనలో భాగమైన వైరాలజీ ప్రొఫెసర్ జోనాథన్ బాల్ మాట్లాడుతూ… ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ వాస్తవానికి వైరస్ వ్యాప్తిని నిరోధించలేదు. కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన కోతుల్లోనూ, ఇవ్వని వాటిల్లోనూ వైరస్ లోడ్ ఒకేలా ఉందన్నారు. మానవులతో కూడా ఇదే జరిగితే ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్ వ్యాప్తిని ఆపలేదని స్పష్టం చేశారు. మనుషులపై ట్రయిల్స్ మొదలుపెట్టిన తర్వాతే ఈ మెడిసిన్‌పై పూర్తిగా క్లారిటీ వస్తుందని బాల్ సూచించారు. కాగా, త్వరలోనే ఈ వ్యాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ ప్రయత్నాలు చేస్తోంది. మరి అప్పుడు ఫలితాలు ఎలా వస్తాయో వేచి చూడాలి. అటు పూర్తిస్థాయిలో కరోనాను నియంత్రించేందుకు వ్యాక్సిన్ వస్తుందా? రాదా? అని ఇప్పటికే కొందరిలో ప్రశ్నలు తలెత్తాయి.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?