కరోనా ఎఫెక్ట్.. ఆటగాళ్ల వేతనాలు కుదింపు..!
Coronavirus Outbreak: కరోనా వైరస్ కారణంగా భారత ఆటగాళ్ల వేతనాల్లో కుదింపులు ఖచ్చితంగా ఉండవచ్చునని ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ మల్హోత్రా తెలిపాడు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా జరగాల్సి ఉన్న మ్యాచ్ లు, టోర్నమెంట్స్, లీగ్స్ అన్ని కూడా వాయిదా పడిపోవడంతో ఆయా దేశాల బోర్డులకు భారీ నష్టం వాటిల్లింది. మరోవైపు ప్రపంచంలో అత్యధిక ధనిక బోర్డు అయిన బీసీసీఐ కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయింది. దక్షిణాఫ్రికాతో జరగాల్సిన సిరీస్ రద్దు కావడం.. అంతేకాకుండా […]

Coronavirus Outbreak: కరోనా వైరస్ కారణంగా భారత ఆటగాళ్ల వేతనాల్లో కుదింపులు ఖచ్చితంగా ఉండవచ్చునని ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ మల్హోత్రా తెలిపాడు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా జరగాల్సి ఉన్న మ్యాచ్ లు, టోర్నమెంట్స్, లీగ్స్ అన్ని కూడా వాయిదా పడిపోవడంతో ఆయా దేశాల బోర్డులకు భారీ నష్టం వాటిల్లింది.
మరోవైపు ప్రపంచంలో అత్యధిక ధనిక బోర్డు అయిన బీసీసీఐ కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయింది. దక్షిణాఫ్రికాతో జరగాల్సిన సిరీస్ రద్దు కావడం.. అంతేకాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదమూడో ఎడిషన్ వాయిదా పడటంతో భారీ నష్టమే వాటిల్లిందని చెప్పవచ్చు.
అటు దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో ఐపీఎల్ ఈ సంవత్సరం జరిగేలా కనిపించట్లేదు. ఒకవేళ అదే గనక జరిగితే దాదాపు 10 వేల కోట్లు బీసీసీఐ నష్టపోవాల్సి ఉందని అంచనా.
ప్రస్తుత పరిస్థితుల్లో భారత క్రికెట్ బోర్డు నష్టాల్లో ఉంది. ఈ తరుణంలో ఖచ్చితంగా ఆటగాళ్ల వేతనాల్లో సవరింపులు ఉంటాయి. ఇలాంటి కష్ట సమయాల్లోనే ప్రతీ ఒక్కరూ చేయూతను ఇవ్వాల్సి ఉంటుందని అశోక్ మల్హోత్రా స్పష్టం చేశారు.
ఇవి చదవండి:
చైనాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ రెడీ.. విదేశాల్లో ట్రయిల్స్..
చైనా మాస్క్‌లు, టెస్టింగ్ కిట్స్ నాసిరకం.. తిప్పి పంపేస్తున్న దేశాలు.!
ఏపీలో కొత్తగా 43 పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాల్లోనే అత్యధికం..