కరోనా ఎఫెక్ట్.. చూయింగ్ గమ్‌లపై నిషేధం..

|

Apr 03, 2020 | 3:48 PM

Coronavirus Outbreak: దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో హర్యానా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చూయింగ్ గమ్ అమ్మకాలు, వాడకంపై జూన్ 30 వరకు నిషేధం విధిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. చూయింగ్ గమ్ నమిలి.. ఉమ్మేసేటప్పుడు పక్కనున్న వ్యక్తులకు కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా చూయింగ్ గమ్‌లను అమ్మినా.. కొన్నా వారిపై కఠిన […]

కరోనా ఎఫెక్ట్.. చూయింగ్ గమ్‌లపై నిషేధం..
Follow us on

Coronavirus Outbreak: దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో హర్యానా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చూయింగ్ గమ్ అమ్మకాలు, వాడకంపై జూన్ 30 వరకు నిషేధం విధిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. చూయింగ్ గమ్ నమిలి.. ఉమ్మేసేటప్పుడు పక్కనున్న వ్యక్తులకు కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా చూయింగ్ గమ్‌లను అమ్మినా.. కొన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక హర్యానాలో కరోనా అనుమానితులు సంఖ్య 13 వేలకు చేరింది. అధికారులు వారిపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా ఉంచి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, ఇప్పటికే గుట్కా, పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపైనా ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

ఇది చదవండి: కరోనాపై పోరుకు.. ‘ఆరోగ్య సేతు’ ట్రాకింగ్ యాప్.. ఎలా పని చేస్తుందంటే.?