Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 31 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 131868. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 73560. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 54441. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 3867. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • కరోనా తెలంగాణా బులిటిన్. ఇవ్వాళ తాజాగా 41 పాజిటివ్ కేసులు నమోదు. మొత్తం రాష్ట్రంలో 1854 కరోనా పాజిటివ్ కేసులు . ఇవ్వాళ నలుగురు మృతి. మొత్తం ఇప్పటివరకు 53 మంది కరోనా కు బలి అయ్యారు. యాక్టీవ్ కేసులు 709 మంది చికిత్స పొందుతున్నారు.
  • తిరుమల: ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల రుసుము రీఫండ్. జూన్ 30వ తేది వరకు శ్రీవారి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శన టికెట్లు, తిరుమలలో గదులు బుక్ చేసుకున్న భక్తులకు డబ్బులు రీఫండ్. టికెట్ల వివరాలను refunddesk_1@tirumala.org మెయిల్ ఐడీకి పంపాలని భక్తులను కోరిన టీటీడీ.
  • వరంగల్ 9 మర్డర్ కేసు లో సంచలన బ్రేకింగ్ . 9 మందిని హత్య చేసింది సంజయ్ . మాక్సుద్ భార్య చెల్లెలి తో సంబంధం ఉన్న సంజయ్. మాక్సుద్ భార్య చెల్లలి తో అక్రమ సంబంధం ఉన్న సంజయ్. తనకు అడ్డు రావొద్దని మాక్సుద్ కుటుంబం తో పాటు సన్నిహితంగా ఉన్న బిహారి యువకులను హత్య చేసిన సంజయ్.
  • CRPF జవాన్ లకు కరోనా పాజిటివ్. ఈ రోజు 9 మంది CRPF జవాన్ కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. దేశ వ్యాప్తంగా మొత్తం 359 CRPF సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ. 137 యాక్టీవ్ కేస్ లు. 220 మంది డిశ్చార్జ్, ఇద్దరు మృతి.
  • దేశ వ్యాప్తంగా భానుడి భగ భగ. పంజాబ్, హర్యానా, దక్షిణ యుపి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటాయని IMD హెచ్చరిక.. రాబోయే 5 రోజుల్లో తీవ్రమైన హీట్ వేవ్ ఉంటాయని హెచ్చరిక.

కరోనాపై పోరుకు.. ‘ఆరోగ్య సేతు’ ట్రాకింగ్ యాప్.. ఎలా పని చేస్తుందంటే.?

Coronavirus Outbreak, కరోనాపై పోరుకు.. ‘ఆరోగ్య సేతు’ ట్రాకింగ్ యాప్.. ఎలా పని చేస్తుందంటే.?

Coronavirus Outbreak: ఇండియాలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2301 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 56 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే కరోనా ఎవరికి సోకిందో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే తాజాగా నమోదైన కేసుల్లో కొందరికి ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. దీనితో కేంద్రం ఓ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. కరోనాను దరి చేరకుండా ఉండేందుకు, ఆ వ్యాధి సోకినవారు దగ్గరకు వస్తే గుర్తించేందుకు వీలుగా కేంద్రం ప్రభుత్వం శుక్రవారం ఓ యాప్‌ను రూపొందించింది. ఎలక్ట్రానిక్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను రూపకల్పన చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

‘ఆరోగ్య సేతు’ యాప్ గురించి మరిన్ని విషయాలు…

  1. ఆండ్రాయిడ్ యూజర్లు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో, ఐఫోన్‌ ఉపయోగించేవారు యాప్ స్టోర్‌లలో నుంచి డౌన్లోడ్‌ చేసుకోవాలి.
  2. ఆ తర్వాత పేరు, మొబైల్ నెంబర్‌తో రిజిస్టార్‌ చేసుకోవాలి.
  3. మన ఆరోగ్య విషయాలు, ఇతర ఆధారాలను నమోదు చేయాలి.
  4. అంతేకాక జీపీఎస్‌, బ్లూటూత్‌లను కూడా ఆన్‌ చేసుకోవాలి.
  5.  ప్రస్తుతం ఈ యాప్ 11 బాషలలో అందుబాటులో ఉంది.
  6. ఈ యాప్ అత్యాధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ద్వారా పని చేస్తుంది.

ప్రయోజనాలు…

  • దేశంలో కరోనా కేసుల రిపోర్టు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
  • కరోనాను దరి చేరనివ్వదు.
  • కరోనా వైరస్ ఉన్న వ్యక్తి దగ్గరకు మీరు వెళ్తే యాప్ తక్షణమే మీ లొకేషన్ స్కాన్ చేసి.. మీ డేటాను ప్రభుత్వానికి చేరవేస్తుంది.
  • కోవిడ్ 19 లక్షణాలు ఉన్నా.. వాటిని నిర్ధారించేందుకు ప్రత్యేకమైన చాట్‌బోట్ ఉంటుంది.

ఇది చదవండి: కరోనా వారియర్స్‌కు పేటీఎం చేయూత.. 60 హోటళ్లలలో బస..

Related Tags