ఏపీలో కరోనా పంజా.. ఆ రెండు జిల్లాల్లో లాక్ డౌన్ మరింత కఠినతరం..!

|

Apr 03, 2020 | 6:23 PM

Coronavirus Outbreak: ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మొత్తంగా కోవిడ్ 19 కేసుల సంఖ్య 161కి చేరుకుంది. దీనితో జిల్లాల వారీగా లాక్ డౌన్‌ను కఠినతరం చేస్తున్నారు. నెల్లూరులో అత్యధికంగా 32 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. ఆ జిల్లాలో లాక్ డౌన్ సడలింపు సమయాన్ని కలెక్టర్ కుదించారు. గతంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ సడలింపు ఉండగా.. దాన్ని మూడు గంటలకే […]

ఏపీలో కరోనా పంజా.. ఆ రెండు జిల్లాల్లో లాక్ డౌన్ మరింత కఠినతరం..!
Follow us on

Coronavirus Outbreak: ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మొత్తంగా కోవిడ్ 19 కేసుల సంఖ్య 161కి చేరుకుంది. దీనితో జిల్లాల వారీగా లాక్ డౌన్‌ను కఠినతరం చేస్తున్నారు. నెల్లూరులో అత్యధికంగా 32 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. ఆ జిల్లాలో లాక్ డౌన్ సడలింపు సమయాన్ని కలెక్టర్ కుదించారు. గతంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ సడలింపు ఉండగా.. దాన్ని మూడు గంటలకే పరిమితం చేశారు. దీని ప్రకారం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే ప్రజలు బయటికి వచ్చేందుకు అనుమతిస్తారు.

అటు విశాఖ జిల్లాలో కూడా ఇదే విధంగా లాక్ డౌన్ సమయాన్ని కుదించారు. తాజాగా నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఢిల్లీ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారి సంఖ్య ఇంకా తేలకపోవడం, ఇతరత్రా కారణాల కారణంగా లాక్ డౌన్ వేళలను కుదించినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు చెప్పారు. కాగా, అన్ని జిల్లాల్లోనూ లాక్ డౌన్ సడలింపును కుదించే అవకాశం ఉందని సమాచారం.

ఇది చదవండి: గుడ్ న్యూస్.. కరోనా వ్యాక్సిన్ ట్రయిల్ విజయవంతం.. త్వరలోనే..