గుడ్ న్యూస్.. కరోనా వ్యాక్సిన్ ట్రయిల్ సక్సెస్.. త్వరలోనే..

Coronavirus Outbreak: చైనాలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలను తీసింది. అభం శుభం తెలియని పసివాళ్లు కూడా ఈ వైరస్ బారిన పడి మృత్యువాతపడ్డారు. గంట గంటకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, మరణాలతో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్‌కు అంతం ఎప్పుడో తెలియని పరిస్థితుల్లో దేశాలన్నీ కూడా లాక్ డౌన్ ప్రకటించాయి. అయితే తాజాగా ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ గురించి ఓ గుడ్ న్యూస్ బయటికి వచ్చింది. పిట్స్‌బర్గ్ యూనివర్సిటీ […]

గుడ్ న్యూస్.. కరోనా వ్యాక్సిన్ ట్రయిల్ సక్సెస్.. త్వరలోనే..
Follow us

|

Updated on: Apr 04, 2020 | 8:40 AM

Coronavirus Outbreak: చైనాలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలను తీసింది. అభం శుభం తెలియని పసివాళ్లు కూడా ఈ వైరస్ బారిన పడి మృత్యువాతపడ్డారు. గంట గంటకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, మరణాలతో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి.

ఈ వైరస్‌కు అంతం ఎప్పుడో తెలియని పరిస్థితుల్లో దేశాలన్నీ కూడా లాక్ డౌన్ ప్రకటించాయి. అయితే తాజాగా ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ గురించి ఓ గుడ్ న్యూస్ బయటికి వచ్చింది. పిట్స్‌బర్గ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా విరుగుడు తయారు చేయడంలో పురోగతి సాధించారు. కరోనా రోగుల శరీరాల్లో నుంచి రక్త నమూనాను తీసుకొని వాటిని ఎలుకలపై టెస్ట్ చేసి.. వాటిల్లోకి వైరస్ ను ప్రవేశపెట్టారు. ఇక వాటిపై ఇంజెక్షన్ ద్వారా యాంటీ బాడీలను పంపించి ట్రయిల్స్ నిర్వహించగా.. అవి సత్ఫలితాలను అందించాయి.

తాజాగా ఎలుకలపై వ్యాక్సిన్‌ను ప్రయోగించినప్పుడు కావాల్సిన యాంటీ బాడీలను ఉత్పన్నం చేయడమే కాకుండా.. అవి వైరస్‌ను తటస్థ స్థితికి తీసుకొచ్చాయని యూనివర్సిటీ పరిశోధకుల టీం వెల్లడించింది. రాబోయే మూడు నెలల్లోనే మనుషులపై ట్రయిల్స్ చేయాలని చూస్తున్నారు. ఒకవేళ అవి విజయవంతం అయితే.. వ్యాక్సిన్ ఒక ఏడాదిలో ప్రజలకు అందుబాటులోకి రావచ్చునని వారు అంటున్నారు.

కాగా, కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తయారు చేస్తున్న ఈ టీమ్ 2003లో SARS-CoV,  2014లో MERS-CoVలకు పని చేశారు. ఈ రెండు వైరస్‌లు SARS-CoV-2కు సంబంధించినవే. అందుకే తమకు ఈ కోవిడ్ 19తో ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని..మహమ్మారిని అరికట్టడంలో రోగనిరోధక శక్తిని ప్రేరేపించే ‘స్పైక్ ప్రోటీన్’ కీలకపాత్ర పోషిస్తుందని కో- సీనియర్ ఆండ్రియా గంబోట్టో తెలిపారు. 

ఇది చదవండి: ఆ రాష్ట్రంలో మరో ‘మర్కజ్’కు ప్లాన్.. ముందే ఆపేసిన పోలీసులు..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో