ఆ రాష్ట్రంలో మరో ‘మర్కజ్’కు ప్లాన్.. ముందే ఆపేసిన పోలీసులు..

Coronavirus Updates: లాక్ డౌన్ ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉందని.. దానికి తగ్గట్టుగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటే.. ‘నిజాముద్దీన్ మర్కజ్’తో గత రెండు రోజులుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. అది కూడా  ఈ కార్యక్రమానికి హాజరైన వారికే కరోనా పాజిటివ్ తేలడంతో తీవ్ర కలకలం రేపింది. విదేశాలు, దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఈ మర్కజ్‌కు పెద్ద సంఖ్యలో తబ్లీఘీకి హాజరయ్యారు. […]

ఆ రాష్ట్రంలో మరో 'మర్కజ్'కు ప్లాన్.. ముందే ఆపేసిన పోలీసులు..
Follow us

|

Updated on: Apr 03, 2020 | 4:02 PM

Coronavirus Updates: లాక్ డౌన్ ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉందని.. దానికి తగ్గట్టుగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటే.. ‘నిజాముద్దీన్ మర్కజ్’తో గత రెండు రోజులుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. అది కూడా  ఈ కార్యక్రమానికి హాజరైన వారికే కరోనా పాజిటివ్ తేలడంతో తీవ్ర కలకలం రేపింది. విదేశాలు, దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఈ మర్కజ్‌కు పెద్ద సంఖ్యలో తబ్లీఘీకి హాజరయ్యారు. ఇక విదేశీయుల నుంచి కరోనా వైరస్ భారతీయులకు సోకింది.

ఇదిలా ఉంటే నిజాముద్దీన్ మర్కజ్ లాంటి కార్యక్రమం ఒకటి ముంబై సమీపంలోని వాసైలో మార్చి 14న ఏర్పాటు చేయడానికి తబ్లీఘీ జమాత్ సంఘం వారు పాల్గర్‌ పోలీసులను జనవరిలో అనుమతి కోరారు. ఇందుకు అనుమతి కూడా లభించింది. అయితే మార్చిలో మహారాష్ట్రలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆ ప్రాంత ఇన్‌స్పెక్టర్‌ జనరల్స్‌ కొంకణ్‌ రాంజే, నికేత్‌ కౌషిక్‌ అప్రమత్తమయ్యి వెంటనే పాల్గర్‌ జిల్లా ఎస్పీతో భేటి అయ్యారు.

ఆ ప్రాంతంలో మున్ముందు జరగబోయే పెద్ద కార్యక్రమాలపై ఆరా తీశారు. మర్కజ్ కార్యక్రమానికి విదేశాల నుంచి వేల సంఖ్యలో తబ్లీఘీ కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండటం వెంటనే అనుమతులు రద్దు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు మార్చి 6న నిర్ణయం తీసుకున్నారు. కాగా, తాజాగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమం దేశంలో కలకలం సృష్టించడంతో.. ముందు చూపుతో ముంబైలో జరగాల్సిన దాన్ని అడ్డుకోవడం మంచిదయ్యిందని మహారాష్ట్ర పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇది చదవండి: కరోనా ఎఫెక్ట్.. చూయింగ్ గమ్‌లపై నిషేధం..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో