IPL 2024: రికార్డ్ విజయంతో టాప్ 4 జట్లకు షాకిచ్చిన పంజాబ్.. ఏ స్థానంలో ఎవరున్నారంటే?

IPL 2024 Points Table: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) మొదటి రౌండ్ మ్యాచ్‌లు ముగిశాయి. ఇప్పుడు సెకండ్ హాఫ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ 2వ రౌండ్‌లో కూడా తమ గొప్ప ప్రదర్శనను కొనసాగించడం ద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

IPL 2024: రికార్డ్ విజయంతో టాప్ 4 జట్లకు షాకిచ్చిన పంజాబ్.. ఏ స్థానంలో ఎవరున్నారంటే?
Ipl 2024 Points Table
Follow us

|

Updated on: Apr 27, 2024 | 9:07 AM

IPL 2024 Points Table: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024)లో ఇప్పటివరకు 42 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. రెండో రౌండ్‌ మ్యాచ్‌లు ప్రారంభం కాగానే స్కోరుబోర్డులో గణనీయమైన మార్పు కనిపించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానంలో ఉండగా, ఆర్సీబీ చివరి స్థానంలో ఉంది. దీని ప్రకారం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఎలాంటి మార్పులు చేసుకున్నాయో ఓసారి చూద్దాం..

రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడగా, అందులో 7 మ్యాచ్‌లు గెలిచింది. మొత్తం 14 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రస్తుత నెట్ రన్ రేట్ +0.698లుగా నిలిచింది.

కోల్‌కతా నైట్ రైడర్స్ 8 మ్యాచ్‌ల్లో 5 గెలిచి మొత్తం 10 పాయింట్లు సాధించింది. అలాగే +0.972 నెట్ రన్‌తో రెండో స్థానంలో నిలిచింది.

ఇవి కూడా చదవండి

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 10 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. SRH జట్టు ప్రస్తుత నికర రన్ రేట్ +0.577లుగా నిలిచింది.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. LSG ఆడిన 8 మ్యాచ్‌లలో 5 గెలిచింది. మొత్తం 10 పాయింట్లతో +0.148 నికర రన్ రేట్‌ను కలిగి ఉంది.

8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 4 ఓటములతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 5వ స్థానంలో ఉంది. మొత్తం 8 పాయింట్లతో CSK జట్టు ప్రస్తుత నెట్ రన్ రేట్ +0.415లుగా నిలిచింది.

ఢిల్లీ క్యాపిటల్స్ 9 మ్యాచ్‌లలో 4 గెలిచి 8 పాయింట్లు -0.386 నెట్ రన్ రేట్‌తో సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది.

9 మ్యాచ్‌ల్లో 4 విజయాలు నమోదు చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు 6 పాయింట్లతో 7వ స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ జట్టు నెట్ రన్ రేట్ -0.974లుగా నిలిచింది.

పంజాబ్ కింగ్స్ జట్టు 9 మ్యాచ్‌ల్లో 3 గెలిచి 6 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ జట్టు ప్రస్తుత నెట్ రన్ రేట్ -0.187లుగా నిలిచింది.

8 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ముంబై ఇండియన్స్ జట్టు 6 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ జట్టు నికర రన్ రేట్ -0.227లుగా నిలిచింది.

RCB జట్టు ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడగా, 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో 4 పాయింట్లు మాత్రమే సాధించిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. అలాగే RCB జట్టు ప్రస్తుత నెట్ రన్ రేట్ -0.721లుగా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..