ANIL KUMAR POKA

అందుకే ఇంత గ్యాప్.. తప్పదు మరి.! ఇలియానా కామెంట్స్ వైరల్.

27 April 2024

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తెలుగు కుర్రాళ్ల మతిపోగొట్టి.. అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ ఇలియానా.

దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. అప్పటి తెలుగు హీరోయిన్స్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది ఈ వయ్యారి.

ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ భామ.. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పోకిరి సినిమాలో మెరిసింది.

మహేష్ బాబు నటించిన ఈ మూవీతో ఇలియానా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత వెనక్కు తిరిగి చూసుకోలేదు.

ఈ మధ్య కంప్లీట్ సినిమాలకు దూరమైన ఈమె పెళ్లిపై క్లారిటీ ఇవ్వకుండానే అమ్మగా ప్రమోషన్ పొందింది. తాజాగా మాట్లాడుతూ..

సినిమాల ఎంపికలో తాను ఆచితూచి వ్యవహరిస్తుండటం వల్లనే ఎక్కువ గ్యాప్‌ వస్తుంటుందని అన్నారు నటి ఇలియానా.

కానీ ఇకపై అలా జరగకూడదని.. వరుసగా సినిమాలు చేయాలని అనుకున్న సందర్భంలో కరోనా విరుచుకుపడిందని చెప్పారు.

ఆ వెంటనే తాను గర్భం దాల్చడం, బాబుకు జన్మనివ్వడంతో మరింత గ్యాప్‌ వచ్చినట్టు కనిపించిందని తెలిపారు ఇలియానా.