India Corona Cases: దేశంలో కరోనా కల్లోలం.. కొత్తగా ఒక్కరోజు వ్యవధిలో 2,64,202 కేసులు

|

Jan 14, 2022 | 10:16 AM

దేశంలో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా మారింది. రోజువారి కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒమిక్రాన్ వేరియంట్ కూడా టెన్షన్ రేపుతోంది.

India Corona Cases: దేశంలో కరోనా కల్లోలం.. కొత్తగా ఒక్కరోజు వ్యవధిలో 2,64,202 కేసులు
India Corona Cases
Follow us on

Corona India News: దేశంలో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా మారింది. రోజువారి కేసుల సంఖ్య భారీగా పెరిగింది.  గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 2,64,202 కేసులు వెలుగుచూశాయి. వైరస్​ కారణంగా కొత్తగా మరో 315 మంది మరణించారు. 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,09,345 మంది వ్యాధి బారి​ నుంచి కోలుకున్నారు. కాగా దేశంలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 14.78 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • దేశంలో మొత్తం కరోనా కేసులు: 36,582,129
  • దేశంలో  మొత్తం కరోనా మరణాలు: 4,85,350
  • ప్రస్తుతం దేశంలో వైరస్ యాక్టివ్ కేసులు: 12,72,073
  • మొత్తం కోలుకున్నవారు: 3,48,24,706

మరోవైపు దేశంలో ఒమిక్రాన్​ కేసులు సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,753కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్​లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా శరవేగంగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 73,08,669 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,55,39,81,819కు చేరింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికి వైరస్ సోకినా పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ, దీర్ఘాకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రమాద తీవ్రత పొంచి ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ప్రజలంతా మాస్కులు ధరించాలని,  భౌతిక దూరం పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:  ‘అమ్మా నేనెట్టా బ్రతికేది’.. తల్లికి అంత్యక్రియలు చేసిన శ్మశానవాటికలో తనయుడు ఆత్మహత్య

అక్క ఆడపడుచుతో ప్రేమలో పడ్డ యువతి.. చివరికి ఊహించని ట్విస్ట్