ఎన్టీఆర్ పాట పేరడీతో ‘కరోనా’పై కీరవాణి సాంగ్.. విన్నారా..!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాపై ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఓ పాటను విడుదల చేశారు. ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నం.1 సినిమాలోని ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పాటను పేరడీ చేసి కరోనాపై ఆయన కొత్త పాటను విడుదల చేశారు.

ఎన్టీఆర్ పాట పేరడీతో కరోనాపై కీరవాణి సాంగ్.. విన్నారా..!

Edited By:

Updated on: Mar 31, 2020 | 10:53 PM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాపై ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఓ పాటను విడుదల చేశారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నం.1 సినిమాలోని ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి’ పాటను పేరడీ చేసి కరోనాపై ఆయన కొత్త పాటను విడుదల చేశారు. అందులో కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఇంటి దగ్గరే ఉండండంటూ ఆయన సూచించారు. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. కాగా గతంలో నమస్కారం గొప్పదనం చెబుతూ కీరవాణి చెప్పిన ఓ కవిత.. కరోనా వైరస్ నేపథ్యంలో మళ్లీ ఈ మధ్యన వైరల్ అయిన విషయం తెలిసిందే.

Read This Story Also: క్లారిటీ ఇచ్చేసిన రాక్‌స్టార్.. ‘గబ్బర్ సింగ్’ కాంబో ఈజ్ బ్యాక్..!