Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 98 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. 2 లక్షలకు చేరువ లో కరోనా కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 198706. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 97581. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 95526. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5598. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • "తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నా సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తమ ప్రాణాలను అర్పించిన అమర వీరుల స్ఫూర్తి మరువలేనిది"- కేంద్ర సహాయక హోంమంత్రి జి.కిషన్ రెడ్డి
  • చెన్నై : తమిళనాడు లో రుతుపవనాల ప్రభావం తో భారీ గా కురుస్తున్న వర్షాలు . తిరువళ్లూరు,కాంచీపురం జిల్లాలతో పాటు వెల్లూర్ ,విరుదునగర్,నీలగిరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు . పలు చోట్ల రోడ్లన్నీ జలమయం ,ఉరుములు తో కూడిన వర్షాలకు పలు చోట్ల నేలకొరిగిన చెట్లు . తిరువళ్లూరు జిల్లాలో పిడుగుపాటు కి ఒక మహిళ మృతి.
  • టిటిడి : తిరుమలలో శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. టిటిడి ఉద్యోగాలు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి. 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్శనం కల్పించాలని సూచన. టీటీడీ ఈవో లేఖకు స్పందించిన ఏపీ ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జే.ఎస్.వి ప్రసాద్.
  • ఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కార్యాలయంలో కరోనా పాజిటివ్. దాదాపు 13 మంది వ్యక్తులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన అధికారులు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం.
  • టీవీ9 తో ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ శిశి కళ . ఉస్మానియా మెడికల్ కాలేజీ లో 12 మందికి కోవిడ్ పాజిటివ్. భయం గుప్పెట్లో ఉస్మానియా పీజీలు. ఇప్పటికే రిడింగ్ రూమ్ ను మోసివేసిన కాలేజ్ యాజమాన్యం. ప్రతి ఒక్క పీజీ ని ppe కిట్స్ వెస్కొమని సూచిస్తున్న ప్రిన్సిపల్ శశికళ. జూనియర్ డాక్టర్స్ కు పాజిటివ్ రావటం తో హాస్టల్ ను శానిటేషన్ చేసిన ghmc.

క్లారిటీ ఇచ్చేసిన రాక్‌స్టార్.. ‘గబ్బర్ సింగ్’ కాంబో ఈజ్ బ్యాక్..!

గబ్బర్‌సింగ్ కాంబో మళ్లీ సెట్స్‌ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్‌ 28వ చిత్రానికి హరీష్‌ శంకర్ దర్శకత్వం వహించబోతున్నారు.
Gabbar Singh trio to team up again, క్లారిటీ ఇచ్చేసిన రాక్‌స్టార్.. ‘గబ్బర్ సింగ్’ కాంబో ఈజ్ బ్యాక్..!

గబ్బర్‌సింగ్ కాంబో మళ్లీ సెట్స్‌ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్‌ 28వ చిత్రానికి హరీష్‌ శంకర్ దర్శకత్వం వహించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించబోయే ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంగీత దర్శకుడిపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా కోసం తన ఫేవరెట్ రాక్‌స్టార్‌కే మరోసారి హరీష్‌ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రాకపోయినా.. దేవీ శ్రీ ప్రసాద్ చేసిన ట్వీట్.. ఆ వార్తలకు బలం చేకూరుస్తోంది.

ఇవాళ హరీష్‌ శంకర్ పుట్టినరోజు నేపథ్యంలో ఆయనకు విష్ చేసిన దేవీ శ్రీ ప్రసాద్.. మరోసారి మనమిద్దరం కలిసి మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు ఎదురుచూస్తున్నా పేర్కొన్నారు. దానికి హరీష్ స్పందిస్తూ.. సర్‌ జీ.. మీతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా అని అన్నారు. దీంతో పవన్‌ సినిమాకు దేవీ కన్ఫర్మ్ అయినట్లు ఓ క్లారిటీ వచ్చేసింది. అందులోనూ అటు హరీష్, ఇటు మైత్రీ మూవీ మేకర్స్ ఇద్దరికీ దేవీతో మంచి ర్యాపో ఉండటంతో.. పవన్ మూవీ కోసం అతడినే కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. మరి దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. కాగా ఒకవేళ ఇదే నిజమైతే పవన్‌ కల్యాణ్‌కు ఐదోసారి సంగీతాన్ని అందించే అవకాశం డీఎస్పీకి వచ్చినట్లే. వీరిద్దరి కాంబినేషన్లో జల్సా, గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది, సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలు తెరకెక్కాయి.

Related Tags