Breaking:ఏపీలో రెండో కరోనా మృతి.. ఎక్కడంటే..!
ఏపీలో రెండో కరోనా మృతి నమోదైంది. అనంతపురం జిల్లా హిందూపురంలో కరోనాతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మూడు రోజుల క్రితం అతడు ఆసుపత్రిలో చేరగా..

ఏపీలో రెండో కరోనా మృతి నమోదైంది. అనంతపురం జిల్లా హిందూపురంలో కరోనాతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మూడు రోజుల క్రితం అతడు ఆసుపత్రిలో చేరగా.. రెండు రోజుల క్రితం శాంపిల్స్ సేకరించి టెస్ట్‌కు పంపారు వైద్యులు. ఈ రోజు రిపోర్టులో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో మృతుడికి సంబంధించి 8మందిని క్వారంటైన్‌కు తరలించారు. వారితో పాటు అతడికి చికిత్స అందించిన డాక్టర్లు, సిబ్బందికి కూడా క్వారంటైన్‌కు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా ఏపీలో కరోనా బాధితుల సంఖ్య ఇవాళ్టికి 190కు చేరింది. ఇవాళ ఒక్క రోజే 10 కొత్త కేసులు నమోదయ్యాయి.
Read This Story Also: బాలీవుడ్ సింగర్‌కు ఊరట.. టెస్ట్‌లో నెగిటివ్.. కానీ..!