వైద్యుల నిర్లక్ష్యం.. కోవిడ్ అనుమానితుడు మృతి..!

| Edited By:

Apr 15, 2020 | 6:31 PM

వైద్యుల నిర్లక్ష్యంతో కరోనా లక్షణాలున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.  బద్వాలీ చౌకీ ప్రాంతానికి చెందిన పాండు చందానే  (60) అనే వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు

వైద్యుల నిర్లక్ష్యం.. కోవిడ్ అనుమానితుడు మృతి..!
Follow us on

వైద్యుల నిర్లక్ష్యంతో కరోనా లక్షణాలున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.  బద్వాలీ చౌకీ ప్రాంతానికి చెందిన పాండు చందానే  (60) అనే వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఓ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు మందులు రాసి ఇంటికి పంపించారు.  ఇక మంగళవారం పాండు పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో.. మరోసారి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. అయితే, అంబులెన్స్‌ పంపడానికి ఆ ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారు. దాంతో కుటుంబ సభ్యులు అతడిని బైక్‌పైనే ఆసుపత్రికి తీసుకెళ్లనుండగా.. మార్గమధ్యంలోనే మృతి చెందాడు. అంబులెన్స్‌ పంపించి ఉంటే పాండు బతికేవాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అయితే ఇండోర్‌ నగర మెడికల్ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ ఈ ఆరోపణల్ని తోసిపుచ్చారు. మొదట పాండుని ఓ వ్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారని.. అక్కడి నుంచి బైక్‌పై ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా దురదృష్టవశాత్తూ అతడు మరణించాడని వెల్లడించారు. ఇదిలా ఉంటే మృతుని కుటుంబ సభ్యుల నుంచి రక్త నమూనాలు సేకరిస్తామని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ పీఎస్ ఠాకూర్‌ చెప్పారు.

Read This Story Also: కరోనా ఎఫెక్ట్: ఆ రంగంలో 3.8కోట్ల ఉద్యోగాలు పోయే అవకాశం..!