మహారాష్ట్రలో 15 వేల మార్క్‌ దాటిన కేసులు

| Edited By:

May 05, 2020 | 9:57 PM

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసుల్లో పెద్ద ఎత్తున ఇక్కడ నమోదైనవే కావడం గమనార్హం. రోజురోజుకు పెరుగుతున్న కేసుల తీవ్రత చూస్తుంటే.. మహారాష్ట్రలో కేసులు ఎక్కడికి చేరుతాయన్నది అర్ధం కాని పరిస్థితి తలెత్తుతోంది. కేసుల సంఖ్యను చూస్తూ స్థానిక ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు.మహారాష్ట్రలో మంగళవారం కొత్తగా 841 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మంగళవారం నాడు కరోనా బారినపడి […]

మహారాష్ట్రలో 15 వేల మార్క్‌ దాటిన కేసులు
Follow us on

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసుల్లో పెద్ద ఎత్తున ఇక్కడ నమోదైనవే కావడం గమనార్హం. రోజురోజుకు పెరుగుతున్న కేసుల తీవ్రత చూస్తుంటే.. మహారాష్ట్రలో కేసులు ఎక్కడికి చేరుతాయన్నది అర్ధం కాని పరిస్థితి తలెత్తుతోంది. కేసుల సంఖ్యను చూస్తూ స్థానిక ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు.మహారాష్ట్రలో మంగళవారం కొత్తగా 841 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మంగళవారం నాడు కరోనా బారినపడి 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో కరోనా బారినపడి 617 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

కాగా.. మంగళవారం నాడు కరోనా మహమ్మారి నుంచి కోలుకుని 354 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ నమోదైన కేసులతో మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,525కు చేరింది. ఇక కరోనా మహమ్మారి నుంచి ఇప్పటివరకూ 2819 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని అధికారులు వెల్లడించారు.