చైనాలోని ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించలేదు..

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి తొలుత చైనాలోని వుహన్ నగరంలో పురుడుపోసుకుంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో మృతి చెందగా.. పాజిటివ్ కేసుల సంఖ్య గంటగంటకూ పెరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే చైనా.. ప్రపంచదేశాలపై బయో వార్ ప్రకటించి.. కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో సృష్టించిందని అనేక ఆరోపణలు వచ్చాయి. అటు అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ వ్యాఖ్యలు చేసిన దాఖలాలు లేకపోలేదు. అయితే చైనా కోవిడ్ 19ను […]

చైనాలోని ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించలేదు..
Follow us

|

Updated on: Apr 16, 2020 | 10:00 PM

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి తొలుత చైనాలోని వుహన్ నగరంలో పురుడుపోసుకుంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో మృతి చెందగా.. పాజిటివ్ కేసుల సంఖ్య గంటగంటకూ పెరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే చైనా.. ప్రపంచదేశాలపై బయో వార్ ప్రకటించి.. కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో సృష్టించిందని అనేక ఆరోపణలు వచ్చాయి. అటు అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ వ్యాఖ్యలు చేసిన దాఖలాలు లేకపోలేదు. అయితే చైనా కోవిడ్ 19ను ల్యాబ్‌లో సృష్టించిందన్న సాక్ష్యాలు అయితే లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని చైనా విదేశాంగశాఖ పేర్కొంది.

వుహన్ నగరంలోని ఓ ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారంటూ వచ్చిన కధనాలను సదరు శాఖాధికార ప్రతినిధి ఒకరు ఈ మేరకు ఖండించారు. ఇక దీనిపై బుధవారం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం కరోనా వైరస్‌ ల్యాబ్‌లో నుంచి వ్యాప్తి చెందినదా లేదా అన్న విషయాలను తేల్చే పనిలో ఉందన్నారు. ఈ అంశంలో చైనా నిజానిజాలను బహిర్గతం చేయాలని.. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా వ్యాప్తి సమాచారం గురించి చైనా నిర్లక్ష్యపు ధోరణిలో వ్యవహరిస్తోందని విమర్శించారు.

Also Read:

ప్రాణాలు వదిలేస్తాం కానీ.. మసీదును విడిచిపెట్టం..

అక్షయ్ రూ.25 కోట్లు విరాళం ఇవ్వడం పెద్ద తప్పు.. శత్రుఘ్న సిన్హా సంచలన వ్యాఖ్యలు..

చేతులెత్తేసిన ఇమ్రాన్ ఖాన్.. ‘మమ్మల్ని ఆదుకోండి’ అంటూ భారత్‌ను వేడుకోలు..

కేంద్రం మరో కీలక నిర్ణయం.. ఈ-పాస్‌గా ‘ఆరోగ్య సేతు’ యాప్..

‘ఇంట్లో మద్యం తయారు చేయడం ఎలా.?’ గూగుల్‌లో ట్రెండ్ సెట్ చేసిన మందుబాబులు…

‘వైకుంఠపురంలో’.. అలా తమిళంలో..

ఐపీఎల్ కోసం ఆసియా కప్ రద్దు చేస్తే ఊరుకోం: పాక్ బోర్డు

లాక్ డౌన్ వేళ.. అక్కడ ఇంటికే మద్యం సరఫరా..!

విమాన ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. డబ్బులు ఫుల్ రీ-ఫండ్..