AP Corona Cases: వామ్మో.! మరోసారి ఏపీలో పడగ విప్పిన కరోనా.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నంటే.!

|

Mar 26, 2021 | 7:44 PM

ఏపీలో కరోనా కేసుల సంఖ్య వెయ్యికి చేరువగా ఉంది. రోజు రోజుకు రెట్టింపు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో కొత్తగా 984 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,96,863కి చేరింది.

AP Corona Cases: వామ్మో.! మరోసారి ఏపీలో పడగ విప్పిన కరోనా.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నంటే.!
AP Corona Updates
Follow us on

Andhra Andhra Pradesh Corona Cases: ఏపీలో కరోనా కేసుల సంఖ్య వెయ్యికి చేరువగా ఉంది. రోజు రోజుకు రెట్టింపు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో కొత్తగా 984 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,96,863కి చేరింది. ఇందులో 4,145 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,85,515 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా రాష్ట్రంలో చిత్తూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రానాలు కోల్పోయారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 7203కు చేరుకుంది. ఇక నిన్న 306 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,46,16,201 సాంపిల్స్‌ను పరీక్షించారు. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 40,604 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 163.. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి.

కరోనా కేసుల ఉధృతి పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. వైరస్‌ను లైట్ తీసుకోవద్దని, అది మరోసారి విజృంభిస్తే ప్రమాదకర పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే ప్రయాణీకులు ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. మాస్కులు ధరిస్తేనే బస్సుల్లోకి అనుమతిస్తామని ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. అలాగే బస్ స్టేషన్లు, బస్సుల్లో శానిటైజర్లను ఏర్పాటు చేస్తామని.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బస్ కాంప్లెక్స్‌లలోని స్టాళ్లలో మాస్క్‌లు విక్రయిస్తారని స్పష్టం చేసింది. అటు కండక్టర్లు, డ్రైవర్లు తప్పనిసరి కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది.

ఇవి కూడా చదవండి : IND vs ENG 2nd ODI Live: టీమిండియా ఆటగాళ్ల దూకుడు.. భారత్ భారీ స్కోర్… ఇంగ్లాండ్ టార్గెట్ 337..

IPL 2021: ఈ నలుగురు ఆటగాళ్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో చోటు దక్కదట.. వారెవరంటే?