దేవాలయాల్లో క్వారంటైన్ కేంద్రాలా? మరెక్కడా చోటు లేదా?

| Edited By:

Apr 06, 2020 | 5:28 PM

రోజురోజుకీ ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారికి కరోనా సోకవడంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా.. బాధితులను, కుటుంబ సభ్యులను, బంధువులను..

దేవాలయాల్లో క్వారంటైన్ కేంద్రాలా? మరెక్కడా చోటు లేదా?
Follow us on

రోజురోజుకీ ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారికి కరోనా సోకవడంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా.. బాధితులను, కుటుంబ సభ్యులను, బంధువులను, వారిని కలిసిన వారినందర్నీ క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు అధికారులు. రోజురోజుకీ పరిస్థితి తీవ్రమవడంతో  కరోనా బాధితులు ఎక్కువైపోతున్నారు. దీంతో ఆలయాల్లో కూడా క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ముందుగా.. శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలను అధికారులు తనిఖీలు కూడా చేశారు.

అయితే ఈ విషయంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్‌కు లేఖ కూడా రాశారు. మరెక్కడా చోటు లేదన్నట్టు ఆలయాల్లో క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు శోచనీయమని లేఖలో తెలిపారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కన్నా విమర్శించారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడేందుకు తమ పార్టీ నాయకులు ప్రయత్నించారని.. కలెక్టర్ వ్యవహరించిన తీరు బాధ్యతా రాహిత్యంగా ఉందని ఆరోపించారు. ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని కన్నా లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

ప్రముఖ నిర్మాత కుమార్తెకు కరోనా పాజిటివ్

వైసీపీ ప్రభుత్వం కూడా 5 వేలు ఇవ్వాలి: చంద్రబాబు

కర్ఫ్యూ సమయంలో కాగడాలతో హల్చల్, రాజాసింగ్ వీడియో వైరల్..

రేపే సూపర్ ‘పింక్ మూన్’.. కానీ మనం చూడలేం..

రూ.30 వేల కోట్లకి పటేల్ విగ్రహం అమ్మకం.. వైద్య పరికరాల కోసం..