తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కోవిడ్ సోకింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు, సినీ సెలబ్రిటీలు వైద్యులు, పోలీసులు కూడా ఈ వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా కోవిడ్ వ్యాప్తి చెందుతూనే ఉంది. ఇక సామాన్యులతో పాటు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలకు కూడా కరోనా సోకుతూండటంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. గత కొద్ది రోజులుగా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్న ఎమ్మెల్యేకు కరోనా సోకినట్టు రిపోర్టుల్లో తేలింది. ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు, ఇంట్లో పని చేసేవారికి కూడా ఈ వైరస్ టెస్టులు నిర్వహించారు. ఈ రిపోర్టుల్లో ఎమ్మెల్యే భార్య, ఇద్దరు కుమారులు, వంట పని మనిషికి కూడా కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయినట్టు అధికారులు తెలిపారు. వైద్యుల సలహా మేరకు ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.
కాగాప్రస్తుతం తెలంగాణలో కొత్తగా 2256 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 77,513కి చేరింది. ఇక నిన్న 1091 మంది డిశ్చార్జ్ కాగా మొత్తం ఇప్పటివరకూ 53,239 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ప్రస్తుతం 22,568 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు గరిచిన 24 గంటల్లో కరోనాతో 14 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 615కి చేరింది.
Read More:
తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ సృష్టిస్తోన్న కరోనా.. పెరుగుతోన్న కేసుల సంఖ్య
48 గంటలు అన్నీ బంద్.. పుట్టపర్తిలో పూర్తిస్థాయి లాక్‌డౌన్