Corona Outbreak: వచ్చే నెల మధ్యలో ఇండియాలో కరోనా విస్ఫోటనం భారీగా ఉండబోతోందా? అమెరికా పరిశోధకులు ఏం చెబుతున్నారు?

|

Apr 24, 2021 | 1:45 PM

కరోనా కల్లోలంతో భారతదేశం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగించాలని ప్రభుత్వం నిర్ణయించి.. ముందడుగు వేస్తోంది. ఈ తరుణంలో అమెరికా నిపుణులు చెబుతున్న ఒక విషయం మరింత కలవరానికి గురిచేస్తోంది.

Corona Outbreak: వచ్చే నెల మధ్యలో ఇండియాలో కరోనా విస్ఫోటనం భారీగా ఉండబోతోందా? అమెరికా పరిశోధకులు ఏం చెబుతున్నారు?
Coronavirus In India
Follow us on

Corona Outbreak: కరోనా కల్లోలంతో భారతదేశం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగించాలని ప్రభుత్వం నిర్ణయించి.. ముందడుగు వేస్తోంది. ఈ తరుణంలో అమెరికా నిపుణులు చెబుతున్న ఒక విషయం మరింత కలవరానికి గురిచేస్తోంది. అమెరికాలో జరిగిన ఒక పరిశోధన ప్రకారం మే నెల రెండోవారం నాటికి ఇండియాలో కోవిడ్ మరణాల సంఖ్య రోజుకు ఐదువేలకు దాటే అవకాశం ఉందని ఆ పరిశోధన చెబుతోంది. ఈ లెక్క ప్రకారం ఏప్రిల్ ఆగస్టు నెలల మధ్యలో కనీసం మూడు లక్షల మంది దేశవ్యాప్తంగా కోవిడ్ కారణంగా మరణించే అవకాశం కనిపిస్తోంది. కోవిడ్-19 ప్రోజేక్షన్స్ పేరుతో జరిగిన ఆ పరిశోధనలో పలు ఆందోళనకర విషయాలు వెల్లడి అయ్యాయి. ఈ పరిశోధన చేసిన వాషింగ్టన్ యూనివర్సిటీ లోని హెల్త్ మేట్రిక్స్ అండ్ ఇవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ) ఇందుకు సంబధించిన వివరాలను ఏప్రిల్ 15 వతేదీన ప్రకటించింది. ఇండియాలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ కరోనా రెండో వేవ్ పై విజయవంతం అయితే పరిస్థితి మెరుగుపడవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.

రాబోయే కొద్ది వారాల్లో కరోనా మహమ్మారి మరింతగా ప్రజలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని ఐహెచ్ఎంఈ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిశోధనలో భాగంగా భారత్ లో ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితులు.. మరణాల లెక్కలను ఆధారంగా తీసుకున్నారు. ఈ పరిశోధనలో మన దేశంలో కోవిడ్ కారణంగా మరణించే వారి సంఖ్య మే 10 వ తేదీ నాటికి 5,600 కు చేరుతుంది. అదే విధంగా 3,29,000 మరణాలు ఏప్రిల్ 12 – ఆగస్ట్ 1 తేదీల మధ్య నమోదు అవుతాయి. జూలై నాటికి దేశంలో మొత్తం 6,65,000 మంది కరోనా కారణంగా మృత్యువు బారిన పడతారని ఆ స్టడీ చెబుతోంది.

ఇక ఈ స్టడీ కోవిడ్ కేసులు, మరణాల సంఖ్య భారతదేశంలో సెప్టెంబర్ 2020 నుంచి ఫిబ్రవరి 2021 మధ్య తక్కువగా ఉందని చెప్పింది. ఆ తరువాత సీన్ రివర్స్ అయింది. అక్కడి నుంచి రివర్స్ ట్రెండ్ ప్రారంభం అయింది. తరువాత అది ఏప్రిల్ నెలకు ఒక్కసారిగా కేసులు..మరణాల సంఖ్య పెరిగిపోయింది. రోజూ వారీ కోవిడ్ కేసుల సంఖ్య సెప్టెంబర్ 2020 తో పోల్చుకుంటే ఏప్రిల్ నెల ప్రారంభానికి డబుల్ అయింది. ఏప్రిల్ మొదటి రెండో వారల మధ్య రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య 71 శాతం మేర పెరిగింది. మరణాల సంఖ్య 55 శాతం మేర పెరుగుదల నమోదు చేసింది. ఇది కేవలం ప్రజల నిర్లక్ష్యంతోనే జరిగింది. మాస్క్ లు ధరించకపోవడం.. గుంపులుగా చేరడం వంటి కారణాలతోనే ఈ విధంగా కోవిడ్ విరుచుకుపడే అవకాశం దొరికింది.

ఏప్రిల్ మధ్య నాటికి భారతదేశంలో ప్రపంచంలో కోవిడ్ కారణంగా ఎక్కువ మరణాలు నమోదు చేసిన దేశాల్లో ఐదో స్థానానికి చేరిపోయింది. ఐహెచ్ఎంఈ లెక్కల ప్రకారం ఏప్రిల్ మొదటి వారంలో ప్రతీ 24 గంటలకు 1,33,400 కరోనా కేసులు నమోదు అవుతుండగా.. ఈ సంఖ్య మార్చి చివరి వారంలో 78,000 మాత్రమె కావడం గమనార్హం. ఇదే సమయంలో కోవిడ్ మరణాలు 970 నుంచి 1500 లకు చేరుకున్నాయి. చత్తీస్ గడ్, మహారాష్ట్ర, పంజాబ్ లలో ఫేటాలిటీ రేట్ ప్రతి పదిలక్షల జనాభాలో నలుగురు కోవిడ్ కారణంగా మరణిస్తున్నారు.

ఇక వారి లెక్క ప్రకారం దేశంలోని మొత్తం ప్రజల్లో దాదాపుగా 24 శాతం ఏప్రిల్ 12 నాటికి కోవిడ్ బారిన పడ్డారు.
అయితే, ఐహెచ్ఎంఈ నిపుణులు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఆశావాద ధృక్పదంతో ఉన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడంతో జూలై నాటికి 85,600 మందిని కరోనా మరణాల నుంచి కాపాడగాలుగుతారని ఆ నిపుణులు చెబుతున్నారు.
ఈ స్టడీ లెక్కల ప్రకారం మే రెండో వారానికి ప్రతిరోజూ ఇండియాలో 8 లక్షల కొత్త కేసులు నమోదు అయ్యే అవకాశం ఉంది.

Also Read: Sachin Tendulkar’s 48th Birthday: సచిన్ ను ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ అని ఎందుకు పిలుస్తారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.. Viral Video

Ayodhya: అయోధ్య వివాదంలో బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ మధ్యవర్తిత్వం వహించారా? చీఫ్ జస్టిస్ బాబ్డే అది కోరారు.. వెల్లడించిన లాయర్!