పోలీసులు, భద్రతా దళాలకు కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్రపతి

పోలీసులు, భద్రతా దళాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కృతజ్ఞతలు తెలియజేశారు. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ వేళ ప్రజల భద్రతను, దేశ బాధ్యతను తమ భుజాలపై మోస్తోన్న పోలీసులు, భద్రతా దళాలకు..

పోలీసులు, భద్రతా దళాలకు కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్రపతి

Edited By:

Updated on: Apr 20, 2020 | 6:05 PM

పోలీసులు, భద్రతా దళాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కృతజ్ఞతలు తెలియజేశారు. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ వేళ ప్రజల భద్రతను, దేశ బాధ్యతను తమ భుజాలపై మోస్తోన్న పోలీసులకు, భద్రతా దళాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ధన్యవాదాలు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి సేవ చేస్తోన్న స్వచ్ఛంద సేవా సంస్థలు, సంఘ సంస్కర్తలు, వివిధ మత సంస్థలను కోవింద్ అభినందించారు. కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 17,265 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 543 మంది మరణించారు. అలాగే 2,547 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం 14,175 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అటు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి.

Read More: 

పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్

తాతయ్యకు దేవాన్ష్ జన్మదిన శుభాకాంక్షలు.. ఎలా చెప్పాడంటే..

నా ఫస్ట్ సినిమాకు.. ఇలాంటి హీరో దొరికాడేంటని చాలా ఫీల్ అయ్యా..

విద్యార్థుల కోసం కొత్తగా అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చిన గూగుల్