విద్యార్థుల కోసం కొత్తగా అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చిన గూగుల్

మే నెల 7వ తేదీ వరకూ స్కూళ్లు తెరుచుకునే దాఖలాలు కనిపించడం లేదు. అందులోనూ ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి.. ఆ తర్వాత మళ్లీ లాక్‌డౌన్‌ను పెంచినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఒక వేళ లాక్‌డౌన్ తీసినా..

విద్యార్థుల కోసం కొత్తగా అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చిన గూగుల్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 20, 2020 | 6:28 PM

కరోనా వైరస్ కారణంగా భారత దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితయ్యారు. అత్యవసర అవసరాలకు తప్ప బయటకు వచ్చే ఛాన్స్ లేదని ఆంక్షలు విధించారు అధికారులు. ముఖ్యంగా ఈ లాక్‌డౌన్ విద్యా సంస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో పిల్లలు ఖాళీగా ఉండి ఏం చేసేది లేక ఫోన్లలో గేమ్స్ ఆడుకుంటున్నారు. అలాంటి వారి కోసం గూగుల్ ఓ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది.

మే నెల 7వ తేదీ వరకూ స్కూళ్లు తెరుచుకునే దాఖలాలు కనిపించడం లేదు. అందులోనూ ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి.. ఆ తర్వాత మళ్లీ లాక్‌డౌన్‌ను పెంచినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఒక వేళ లాక్‌డౌన్ తీసినా.. వెంటనే పిల్లల్ని స్కూళ్లకు పంపించారు తల్లిదండ్రులు. దీంతో స్కూల్లో నేర్చుకున్నవి పిల్లలు మర్చిపోవచ్చు. అందుకే గూగుల్ ఈ-లెర్నింగ్ అనే సరికొత్త విభాగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవి విద్యార్థులకే కాకుండా బోధనా సిబ్బంది (టీచర్స్)కి కూడా అనుకూలమైన ఫీచర్.

ఇప్పటివరకూ ఇంగ్లీష్, హిందీలో మాత్రమే పాఠాలు అందుబాటులో ఉండేది. ఇప్పుడు భాషతో ఇబ్బంది పడకుండా తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాళీ వంటి పలు ప్రాంతీయ భాషల్లోనూ పాఠాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు గూగుల్ సంస్థ పేర్కొంది. వీటిని మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యంతో వినవచ్చు.

అంతేకాకుండా.. ఇందులో ‘గూగుల్ మీట్’ సదుపాయం ఉంది. దీని ద్వారా ఒకేసారి 250 మంది టీచర్స్, స్టూడెంట్స్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనవచ్చు. ఈ యాప్‌కు ‘గూగుల్ బోలో’ అనే పేరు పెట్టారు. నిజానికి ఈ యాప్‌ని ఈ ఏడాది చివరిలో తీసుకురావాలనుకున్నా.. ప్రస్తుతం లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో.. పిల్లల సమయం వృధా కాకుండాదని ఇప్పుడు తీసుకువచ్చారు. గూగుల్ ప్లే స్టోర్‌లో దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read More: 

పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్

తాతయ్యకు దేవాన్ష్ జన్మదిన శుభాకాంక్షలు.. ఎలా చెప్పాడంటే..

నా ఫస్ట్ సినిమాకు.. ఇలాంటి హీరో దొరికాడేంటని చాలా ఫీల్ అయ్యా..