CORONA DEATHS WHO ALLEGES FRAUD COUNT: ప్రపంచాన్ని గత ఏడాదిన్నర కాలంగా కరోనా (CORONA) వణికిస్తోంది. చైనా (CHINA)లోని వూహన్ (WUHAN) నుంచి రెక్కలు విప్పుకుని ఎగిరిన కరోనా వైరస్ (CORONA VIRUS).. ప్రపంచం నలుమూలలా వున్న దాదాపు అన్ని దేశాలకు చేరుకుంది. జనాభా (POPULATION) ఎక్కువగా వున్న దేశాల్లో మరింతగా విస్తరించింది కరోనా వైరస్. జనసాంద్రత (POPULATION DENSITY) ఎక్కువగా వున్న మన దేశంలో సెకెండ్ వేవ్ (SECOND WAVE) పేరిట మరణ మృదంగం సృష్టిస్తోంది కరోనా వైరస్. అయితే తాజాగా కరోనా సోకిన వారెందరు? వారిలో మృత్యువాత పడిన వారెందరు? ఈ విషయంలో అన్ని దేశాల గణాంకాలను తప్పుపడుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WORLD HEALTH ORGANISATION). అన్ని దేశాలు వెల్లడించిన మరణాల సంఖ్య కంటే సుమారు 12 లక్షల మంది అదనంగా కరోనా బారిన పడి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంఛనా వేస్తోంది.
కోవిడ్ (COVID) మరణాలకు సంబంధించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తాజాగా ఆందోళన కలిగించే నివేదికను వెలువరించింది. కరోనా మరణాల లెక్క నిర్దిష్టంగా జరగడం లేదని అభిప్రాయపడింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది కరోనాతో మృత్యువాత పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా అంఛనా వేస్తోంది. దేశాలన్నీ అధికారికంగా ప్రకటించిన సంఖ్య (సుమారు 18 లక్షల మరణాలు) కంటే అదనంగా మరో 12 లక్షల మంది కరోనాకు బలై వుంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ (WHO) మే 21న ఓ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2020 డిసెంబర్ 31వ తేదీనాటికి ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 8.2 కోట్లు. కానీ మృతుల సంఖ్య 18 లక్షలని వివిధ దేశాలిచ్చిన గణాంకాలలో తేలింది.
అయితే.. వాస్తవానికి అంతకంటే కనీసం 12 లక్షల మంది అదనంగా కరోనాకు బలై వుంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. చాలా దేవాల్లో కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో చేరి.. చికిత్స పొందుతూ మరణించిన వారినే కరోనా మరణాల లెక్కల్లో చూపారని పేర్కొంది. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారు మరణిస్తేనే వారిని కరోనా మరణాల్లో చూపించారని వివరించింది. నిజానికి కరోనా సోకి.. నిర్ధారణ జరగక ముందే మరణించిన వారిని కరోనా మరణాల్లో చూపలేదని తెలిపింది. ఈ రకంగా మరణించిన వారి సంఖ్య పెద్దగానే వుంటుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. కాగా.. కరోనా తొలి వేవ్ (CORONA FIRST WAVE)లో అమెరికా (AMERICA)లో అత్యధికంగా మరణాలు సంభవించాయి. ఆ దేశ జనాభాలో 10 శాతం మందికి అంటే సుమారు మూడున్నర కోట్ల మందికి కరోనా సోకగా.. దాదాపు 6 లక్షల మంది మృత్యువాత పడ్డారు. అదే సమయంలో మనదేశంలో 140 కోట్ల జనాభాకు గాను 2 శాతానికి లోపుగానే కరోనా బారిన పడ్డారు. అయితే జనసాంద్రత అధికం కారణంగానే ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ దేశంలో అధికంగా కనిపిస్తోంది.
తాజాగా దేశంలో సెకెండ్ వేవ్ మోగిస్తున్న మరణ మృదంగం తీవ్రంగా వుంది. ప్రతీ రోజు నాలుగు వేల మందికి పైగా కరోనాకు బలవుతున్న పరిస్థితి. కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో గత వారం రోజులుగా ప్రతి రోజు 3 లక్షలకులోపుగానే కరోనా పాజిటివ్ కేసులు (CORONA POSITIVE CASES) నమోదవుతున్నాయి. కానీ మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. గత వారం రోజుల్లో ఒకట్రెండు రోజులు మరణాలు నాలుగు వేలకు లోపే నమోదైనా .. మళ్ళీ మరణాల సంఖ్య నాలుగు వేల మార్కును దాటుతోంది. ఫటాలిటీ రేటు తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PRIME MINISTER NARENDRA MODI) కరోనా మరణాలను గుర్తు చేస్తూ కంట నీరు పెట్టుకున్న పరిస్థితి నెలకొంది. మరణాల సంఖ్య తగ్గాలంటే కరోనా వైరస్ సోకిన వారిని తొలి దశలోనే గుర్తించడం ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ: రెండో డోసు ఎంత లేటైతే అంత మేలు.. అమెరికన్ సైంటిస్టుల తాజా అధ్యయనం ఫలితమిదే!
ALSO READ: రెండో డోసు ఎంత లేటైతే అంత మేలు.. అమెరికన్ సైంటిస్టుల తాజా అధ్యయనం ఫలితమిదే!