AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ..

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి. కాగా  తెలంగాణలో బుధవారం 24 గంటల్లో 127 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితిపై నిన్న రాత్రి 8 గంట‌ల‌కు...

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 04, 2020 | 8:41 AM

Share

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి. కాగా  తెలంగాణలో బుధవారం 24 గంటల్లో 127 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితిపై నిన్న రాత్రి 8 గంట‌ల‌కు బులిటెన్ విడుద‌ల చేసింది ఆరోగ్య శాఖ‌. రాష్ట్రంలో మంగళవారం సాయం‌త్రం ఐదు గంట‌ల నుంచి బుధవారం సాయంత్రం ఐదు గంట‌ల మ‌ధ్య న‌మోదైన కొవిడ్-19 కేసుల వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఈ 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రానికి చెందిన‌ లోక‌ల్స్ లో 125 మందికి, మ‌రో ఇద్దరు వ‌ల‌స కార్మికుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3020కి చేరింది. ఇందులో స్థానికులు 2572 మంది, విదేశాల నుంచి తిరిగి వ‌చ్చిన‌వారు, వ‌ల‌స కూలీలు 448 మంది ఉన్నారు.

అత్య‌ధికంగా జీహెచ్ఎంసీలో 108 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. రంగారెడ్డి జిల్లాలో 6, అసిఫాబాద్ జిల్లాలో 6, మేడ్చ‌ల్ జిల్లాలో 2, సిరిసిల్ల జిల్లాలో 2, యాదాద్రి , కామారెడ్డి, మహబూబాబాద్ జిల్లాలో ఒక్కొక్క కేసు చొప్పున న‌మోద‌య్యాయి. కరోనాతో బుధవారం ఒక్కరు కూడా చనిపోలేదని తెలిపిన ఆరోగ్య శాఖ.. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 99కు చేరింది. ఇక 1556 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ప్ర‌స్తుతం 1365 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇక ఏపీ విషయానికొస్తే.. రాష్ట్రంలో కొత్తగా 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ కోవిడ్ కేసులు మొత్తం 3279కి చేరాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో ముగ్గురు మృతి చెందగా.. 35 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 967 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Follow Us
ఆక్లాండ్‌లో వన్డే మ్యాచే కోహ్లీ చివరి వన్డేనా?
ఆక్లాండ్‌లో వన్డే మ్యాచే కోహ్లీ చివరి వన్డేనా?
డిసెంబర్‌ 1 నుంచి ఈ బ్యాంకు నిబంధనలలో కీలక మార్పులు.. ఇక బాదుడే!
డిసెంబర్‌ 1 నుంచి ఈ బ్యాంకు నిబంధనలలో కీలక మార్పులు.. ఇక బాదుడే!
4 కార్పొరేషన్లలో హైదరాబాద్ తరహాలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం!
4 కార్పొరేషన్లలో హైదరాబాద్ తరహాలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం!
అన్షుల్ కాంబోజ్‌కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎందుకు?
అన్షుల్ కాంబోజ్‌కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎందుకు?
98.6°F లెక్క మారిందా? స్టాన్‌ఫోర్డ్ స్టడీలో ఆసక్తికర విషయాలు!
98.6°F లెక్క మారిందా? స్టాన్‌ఫోర్డ్ స్టడీలో ఆసక్తికర విషయాలు!
1 రూపాయికే 24 రోజుల వ్యాలిడిటీ..బీఎస్‌ఎన్‌ఎల్‌ మతిపోగొట్టే ప్లాన్
1 రూపాయికే 24 రోజుల వ్యాలిడిటీ..బీఎస్‌ఎన్‌ఎల్‌ మతిపోగొట్టే ప్లాన్
పెళ్లి జీవితంలో ఎదురైన కష్టాలు చెబుతూ కన్నీళ్లు !
పెళ్లి జీవితంలో ఎదురైన కష్టాలు చెబుతూ కన్నీళ్లు !
గుడ్‌న్యూస్.. బస్సు టికెట్లపై భారీ రాయితీలు!
గుడ్‌న్యూస్.. బస్సు టికెట్లపై భారీ రాయితీలు!
వాస్తు టిప్స్ : దీపావళికి ఈ మొక్కలు గిఫ్ట్‌గా ఇస్తే లాభమే లాభం
వాస్తు టిప్స్ : దీపావళికి ఈ మొక్కలు గిఫ్ట్‌గా ఇస్తే లాభమే లాభం
ధంతేరస్ నాడు బంగారం కొంటున్నారా? పేమెంట్‌ చేసే ముందు ఇవి తప్పక తె
ధంతేరస్ నాడు బంగారం కొంటున్నారా? పేమెంట్‌ చేసే ముందు ఇవి తప్పక తె