Corona: కరోనా మరణాలలో 22 శాతం వ్యాక్సిన్‌ తీసుకోని వారే.. ఐసీఎమ్‌ఆర్‌ రీసెర్చ్‌లో షాకింగ్‌ నిజాలు..

|

Feb 04, 2022 | 8:26 PM

Corona: దేశంలో థర్డ్‌ వేవ్‌ వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ వేవ్‌లో వైరస్‌ ఎఫెక్ట్‌ తక్కువగానే ఉంది. ఈసారి ఆస్పత్రుల్లో మరణాలు కూడా

Corona: కరోనా మరణాలలో 22 శాతం వ్యాక్సిన్‌ తీసుకోని వారే.. ఐసీఎమ్‌ఆర్‌ రీసెర్చ్‌లో షాకింగ్‌ నిజాలు..
Covid
Follow us on

Corona: దేశంలో థర్డ్‌ వేవ్‌ వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ వేవ్‌లో వైరస్‌ ఎఫెక్ట్‌ తక్కువగానే ఉంది. ఈసారి ఆస్పత్రుల్లో మరణాలు కూడా తక్కువగానే ఉన్నాయి. దేశంలోని ఆసుపత్రుల్లో మరణాలు వాటికి గల కారణాలను తెలుసుకోవడానికి 37 ఆసుపత్రులలో చేరిన కరోనా రోగులపై ఒక అధ్యయనం జరిగింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఈ గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం.. వ్యాక్సిన్ తీసుకోని కరోనా సోకిన రోగులలో 22 శాతం మంది మరణించారు. ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరామ్‌ భార్గవ మాట్లాడుతూ.. దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగానే థర్డ్‌ వేవ్‌ వచ్చిందన్నారు. రోగులపై చేసిన అధ్యయనంలో టీకాలు వేసిన వారు ఆసుపత్రిలో చేరినట్లు కనుగొన్నారు. వారిలో 10.20 శాతం మంది చనిపోయారు. వీరిలో 91 శాతం మందికి కరోనా రాకముందు కొన్ని తీవ్రమైన జబ్బులు ఉన్నాయి. అదే సమయంలో టీకాలు వేయని వారిలో ఆసుపత్రిలో మరణాల రేటు 21.80 శాతంగా నమోదైంది.

డాక్టర్ భార్గవ ప్రకారం.. కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్ ప్రభావం యువకులపై కనిపించింది. డెల్టా వేరియంట్‌తో బాధపడుతున్న రోగులలో 66.1 శాతం మందికి ముందుగా కొన్ని వ్యాధులు ఉన్నాయని, అయితే ఒమిక్రాన్ రోగులలో 45.80 శాతం మందికి మాత్రమే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయని అధ్యయనంలో తేలింది. జ్వరం, దగ్గు డెల్టా వల్ల కలిగే అత్యంత సాధారణ లక్షణాలు. అయితే ఒమిక్రాన్ గొంతు నొప్పి ప్రధాన లక్షణంగా చెప్పవచ్చు.

థర్డ్‌ వేవ్‌లో రెండు డోస్‌లు వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ఆక్సిజన్ అవసరం చాలా వరకు తగ్గిందన్నారు. ఆసుపత్రుల్లో చేరిన రోగులలో 36.10 శాతం మందికి ఆక్సిజన్ అవసరమైందని తెలిపారు. ఈ వ్యక్తులు రెండు మోతాదులను తీసుకున్నారు. టీకా తీసుకోని రోగులలో 45.50 శాతం మందికి ఆక్సిజన్ థెరపీ అవసరమైంది. టీకాలు వేసిన రోగులలో, 5.4% మందికి వెంటిలేటర్ మద్దతు అవసరమైంది. వ్యాక్సిన్‌ తీసుకోని వారిలో 11.20 శాతం మంది వెంటిలేటర్‌ సపోర్టుపై ఉన్నారు. ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని ఐసీఎంఆర్‌ తెలిపింది. అయితే కేరళలో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.

Viral Photos: ఇదేం పిచ్చి బాబు.. శరీరంపై 800 కీటకాల టాటూలు.. గిన్నీస్‌ రికార్డ్‌..?

Black Salt: గోరు వెచ్చని నీటిలో చిటికెడు నల్ల ఉప్పు.. పరగడుపున తాగితే అద్భుత ప్రయోజనాలు..?

బీ.కామ్‌ చదువుతున్నారా.. కెరీర్‌ గురించి కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..?