AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వలస కార్మికుల దుస్థితి.. కాంగ్రెస్ పిటిషన్.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

ఇండియాలో కరోనా కేసులు తామర తంపరగా పెరిగిపోతుండగా లాకా డౌన్ వల్ల వలస కార్మికుల దుస్థితి ఇంకా ఇప్పటికీ దారుణంగా ఉంది. తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వాళ్ళు నానా పాట్లూ పడుతున్నారు...

వలస కార్మికుల దుస్థితి.. కాంగ్రెస్ పిటిషన్.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
Umakanth Rao
| Edited By: |

Updated on: May 27, 2020 | 4:52 PM

Share

ఇండియాలో కరోనా కేసులు తామర తంపరగా పెరిగిపోతుండగా లాకా డౌన్ వల్ల వలస కార్మికుల దుస్థితి ఇంకా ఇప్పటికీ దారుణంగా ఉంది. తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వాళ్ళు నానా పాట్లూ పడుతున్నారు. మండుతున్న ఎండల్లో రైళ్లు, బస్సుల కోసం  గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ దీప్ సింగ్ సూర్జేవాలా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ.. వారి దుస్థితిపై కేంద్రం, రాష్ట్రాలు జోక్యం చేసుకునేలా చూడాలని, వారి ఉపాధికి వెంటనేఓ  కార్యాచరణ ప్రణాళిక చేపట్టేలా ఆదేశించాలని అభ్యర్థించారు. వలస జీవుల సంక్షేమం కోసం దేశ వ్యాప్త ప్లాన్ అమలయ్యేలా చూడాలని ఆయన కోరారు. ఈ పిటిషన్ పై అత్యవసరంగా రేపే విచారణ జరగాలని కూడా విజ్ఞప్తి చేశారు. కాగా లాక్ డౌన్ కారణంగా ఇంకా వివిధ రాష్ట్రాల్లో చిక్కుబడిన ఈ కార్మికులకు షెల్టర్లు, ఆహార వసతి కల్పించాలని, వారిని స్వస్థలాలకు తరలించేలా చూడాలని ముగ్గురు సభ్యులతో కూడిన బెంచ్ నిన్న కేంద్రానికి, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో 48 గంటల్లోగా లేదా గురువారం లోగా వివరించాలని ఆదేశించింది. లాక్ డౌన్ వల్ల పార్లమెంట్ సమావేశాలు లేని కారణంగా తాను సుప్రీంకోర్టుకెక్కవలసివచ్చిందని రణదీప్ సింగ్ సూర్జేవాలా తన పిటిషన్ లో పేర్కొన్నారు.

రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
బెస్ట్‌ స్కీమ్‌- ప్రతిరోజూ రూ.333 ఆదా చేస్తే చేతికి రూ.17 లక్షలు!
బెస్ట్‌ స్కీమ్‌- ప్రతిరోజూ రూ.333 ఆదా చేస్తే చేతికి రూ.17 లక్షలు!
రాయల్ లుక్‌లో యంగ్‌ బ్యూటీ సారా అర్జున్‌.. మతిపోగొట్టేలా ఫోజులు!
రాయల్ లుక్‌లో యంగ్‌ బ్యూటీ సారా అర్జున్‌.. మతిపోగొట్టేలా ఫోజులు!
చీకట్లో మగ్గుతున్న గిరి పుత్రుల జీవితాల్లో వెలుగులు..!
చీకట్లో మగ్గుతున్న గిరి పుత్రుల జీవితాల్లో వెలుగులు..!
కుంభ రాశిలో త్రిగ్రాహి రాజయోగం.. వీరికి పట్టిందల్లా బంగారమే!
కుంభ రాశిలో త్రిగ్రాహి రాజయోగం.. వీరికి పట్టిందల్లా బంగారమే!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టాలీవుడ్ యంగ్ హీరో
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టాలీవుడ్ యంగ్ హీరో
నోట్లో వేయగానే కరిగిపోతుంది.. తందూరి చికెన్ ఇంట్లో ఇలా చేయండి!
నోట్లో వేయగానే కరిగిపోతుంది.. తందూరి చికెన్ ఇంట్లో ఇలా చేయండి!
ఒక్కసారి ఛార్జింగ్‌తో 110 కి.మీ రేంజ్‌.. ధర ఎంతో తెలుసా?
ఒక్కసారి ఛార్జింగ్‌తో 110 కి.మీ రేంజ్‌.. ధర ఎంతో తెలుసా?
రాజయోగం పట్టనుంది.. రాసిపెట్టుకోండి ఫిబ్రవరిలో ధనవంతులు వీరే
రాజయోగం పట్టనుంది.. రాసిపెట్టుకోండి ఫిబ్రవరిలో ధనవంతులు వీరే
ప్రేమంటే ఇదేరా.. రెండు హృదాయాలను కలిపే అద్భుతమైన కానుక..
ప్రేమంటే ఇదేరా.. రెండు హృదాయాలను కలిపే అద్భుతమైన కానుక..