Coronavirus: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి (Corona) ఉదృతి కొనసాగుతూనే ఉంది. పేరుగుతోన్న రోజువారి కేసులు మళ్లీ భయాందోళనలకు కలిగిస్తున్నాయి. సెకండ్ వేవ్ అప్పటి పరిస్థితులు మళ్లీ పునరావృతి అవుతాయా.? అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇక సెలబ్రిటీలు, రాజకీయనాయకులను సైతం కరోనా వదలడం లేదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు కరోనా బారిన పడగా తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ కూడా కరోనా బారిన పడ్డారు.
కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా తాను కరోనా బారినపడినట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తెలిపిన గడ్కరీ.. హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా క్వారంటైన్‌లో ఉండి.. కరోనా పరీక్ష చేయించుకోవాలని గడ్కరీ సూచించారు.
I have tested positive for Covid 19 today with mild symptoms. Following all the necessary protocols, I have isolated myself and I am under home quarantine. I request all those who have come in contact with me to isolate themselves and get tested.
— Nitin Gadkari (@nitin_gadkari) January 11, 2022
ఇదిలా ఉంటే ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు రాజకీయ నాయకులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. కర్ణాటక సీఎం సీఎం బసవరాజ్ బొమ్మై, బిహార్ సీఎం నీతీశ్ కుమార్‌లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇక ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కూడా కరోనా ఆసుపత్రిలో చేరిన విషయం విధితమే.
Also Read: IND vs SA: 223 పరుగులకే చాప చుట్టేసిన భారత్.. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ..
America Suffers: కరోనా కరాళనృత్యానికి అగ్రరాజ్యం విలవిల.. ప్రపంచ దేశాలకు అమెరికానే ఓ గుణపాఠం
Pragya Jaiswal: సోషల్ మీడియాలో న్యూ లుక్ తో హల చల్ చేస్తున్న హీరోయిన్ ప్రగ్యా..