కేంద్ర ఉద్యోగులకు కొత్త ప్రతిపాదనలు..

కేంద్ర ఉద్యోగులకు కొత్త ప్రతిపాదనలు..

కరోనా నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. కేంద్ర ఉద్యోగులు ఇకపై యేడాదికి 15 రోజులు ఇంటి నుంచే ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. తాజా పరిణామాల దృష్ట్యా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. కేంద్ర సచివాలయంలో సామాజిక దూరం పాటించడంతో పాటు పనివేళల్లో మార్పులు… ఇతరత్రా అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్క్‌ఫ్రం హోం నుంచి పనిని సులభతరం చేయడానికి, అన్ని మంత్రిత్వ శాఖలు, అనుబంధ విభాగాలలో […]

Pardhasaradhi Peri

|

May 14, 2020 | 5:03 PM

కరోనా నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. కేంద్ర ఉద్యోగులు ఇకపై యేడాదికి 15 రోజులు ఇంటి నుంచే ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. తాజా పరిణామాల దృష్ట్యా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. కేంద్ర సచివాలయంలో సామాజిక దూరం పాటించడంతో పాటు పనివేళల్లో మార్పులు… ఇతరత్రా అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్క్‌ఫ్రం హోం నుంచి పనిని సులభతరం చేయడానికి, అన్ని మంత్రిత్వ శాఖలు, అనుబంధ విభాగాలలో ఇ-ఆఫీస్ అమలును డీవోపీటీ ప్రతిపాదించింది. ఇప్పటికే కేంద్రంలోని 75 మంత్రిత్వ శాఖలు డిజిటల్ వేదికగా రోజువారీ కార్యకలాపాలు ప్రారంభించాయి. సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నకేంద్ర హోంశాఖ హెచ్చరికలతో.. ఆయా మంత్రిత్వ శాఖల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. పార్లమెంట్‌తో పాటు వీఐపీ ప్రశ్నల విషయంలో మాత్రం ఒక ఎస్‌ఎంఎస్ ద్వారా అలర్ట్ చేసేందుకు ఓ వ్యవస్థను రూపొందించినట్లు సమాచారం. ఫైల్‌ను ప్రాపెస్ చేసే సమయంలో చైన్ ఆఫ్ కమాండ్‌ వ్యవస్థను అనుసరించాలని అధికారులు భావిస్తున్నారు. ఇక అధికారిక సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా నిర్వహించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu