తిరుమలలో కరోనా కలకలం…అప్రమత్తమైన అధికారులు

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా ఒంగోలు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. తాజాగా తిరుమలలోనూ కరోనా కలకలం రేపింది. దీంతో స్థానిక అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

తిరుమలలో కరోనా కలకలం...అప్రమత్తమైన అధికారులు

Updated on: Jun 19, 2020 | 9:34 PM

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. కొత్తగా 465 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతిచెందారు. రాష్ట్రంలో 376 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 19 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 70 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. ఇప్పటి వరకు మొత్తం 7961 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 96 మంది మృతిచెందారు. జిల్లాలో ముఖ్యంగా ఒంగోలు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. తాజాగా తిరుమలలోనూ కరోనా కలకలం రేపింది. దీంతో స్థానిక అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
తిరుమల లోని బాలాజీనగర్‌లో నివాసముంటున్న ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అతన్ని క్వారంటైన్‌కు తరలించారు. స్థానిక బాలాజీ నగర్‌లోనే నివాసముంటున్న బాధితుడు పని మీద విజయవాడ వెళ్లాడు. తిరిగి వచ్చిన తర్వాత అతడిలో కరోనా లక్షణాలు బయటపడటంతో టెస్టులు చేయించారు. టెస్ట్ రిపోర్టుల్లో కరోనా పాజిటివ్‌గా వచ్చింది. దీంతో అతని పాటు కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్‌కు పంపారు. స్థానికంగా ఉంటున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో బాలాజీనగర్ లో అనధికారికంగా లాక్‌డౌన్ చేశారు. లోపలి వారిని బయటకు, బయటి వారిని బాలాజీనగర్ లోకి అనుమతించకుండా పోలీసులు గ‌ట్టి నిఘా ఏర్పాటు చేశారు. దీంతో… తిరుమలలో మొదటి కరోనా కేసు నమోదైనట్లైంది.