Corona Positive: రాజకీయ నేతలను వెంటాడుతున్న కోవిడ్.. గండ్ర దంపతులకు కరోనా పాజిటివ్..

|

Jan 19, 2022 | 8:41 AM

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన భార్య వరంగల్ జడ్పీ ఛైర్‌పర్సన్ జ్యోతికి కరోనా సోకింది. మిర్చి పంట నష్టాన్ని పరిశీలించేందుకు..

Corona Positive: రాజకీయ నేతలను వెంటాడుతున్న కోవిడ్.. గండ్ర దంపతులకు కరోనా పాజిటివ్..
Gandra Venkat
Follow us on

MLA Gandra Venkataramana Reddy: తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది . ఆదివారం కూడా రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.  కాగా సాధారణ ప్రజల నుంచి రాజకీయ ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు చాలా మంది ఈ వైరస్ కాటుకు గురవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వరుసగా కరోనా బారిన పడుతన్నారు. తాజాగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన భార్య వరంగల్ జడ్పీ ఛైర్‌పర్సన్ జ్యోతికి కరోనా సోకింది. మిర్చి పంట నష్టాన్ని పరిశీలించేందుకు మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లాలో పర్యటించాగా.. వెంట వీరూ కూడా ఉన్నారు. ఆ తర్వాత వెంకటరమణారెడ్డి, మంత్రి నిరంజన్ రెడ్డితోపాటే హెలికాప్టర్ లో హైదరాబాద్ వెళ్లారు. సాయంత్రం గండ్ర దంపతులకు జ్వరం రావడంతో పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో కోవిడ్ పాజిటివ్ అని తేలింది. తమను కలిసినవారు పరీక్షలు చేయించుకొని జాగ్రత్తలు పాటించాలని సూచించారు గండ్ర దంపతులు.

రాష్ట్రంలో కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మూడోదశ ఉద్ధృతి ప్రారంభమూన తర్వాత మంగళవారం అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 2,983 పాజిటివ్ లు నిర్ధారణ అయ్యాయి. ఏడు నెలలు తర్వాత ఇంత భారీ సంఖ్యలో కేసులు రావడం ఇదే తొలిసారి. దీంతో మొత్త బాధితుల సంఖ్య 7,14,639 పెరిగింది.

ఇవి కూడా చదవండి: Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఈ యమ్మీ యమ్మీ సూపర్ సూప్ ట్రై చేయండి..

TDP Vs YCP: డైలీ సీరియల్ని తలపిస్తున్న అనంత రాజకీయం.. కొనసాగుతున్న మాటల యుద్ధం..