ఆ గుడిలో విచిత్రం..కొట్టకుండానే మోగే గుడి గంట..భ‌క్తుల హ‌ర్షం

సుమారు 80 రోజులుగా మూత‌ప‌డ్డ ఆల‌యాలు తిరిగి తెరుచుకున్నాయి. అయితే, క‌రోనా నేప‌థ్యంలో ఆల‌యాల్లో తీర్థ‌ప్ర‌సాదాలు, శ‌ఠ‌గోపం ర‌ద్దు చేశారు. అయితే, గుడికి వెళ్ల‌గానే భ‌క్తులు త‌ప్ప‌క చేసే ప‌ని,.. గుళ్లో గంట మోగించ‌టం..మ‌రీ వైర‌స్ వ్యాప్తితో గుడి గంట కొట్టాల‌న్న భ‌క్తులు భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి.

ఆ గుడిలో విచిత్రం..కొట్టకుండానే మోగే గుడి గంట..భ‌క్తుల హ‌ర్షం
Jyothi Gadda

|

Jun 15, 2020 | 3:23 PM

సుమారు 80 రోజులుగా మూత‌ప‌డ్డ ఆల‌యాలు తిరిగి తెరుచుకున్నాయి. దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌ముఖ దేవాల‌యాల‌కు భ‌క్తులు బారులు తీరుతున్నారు. భక్తి శ్ర‌ద్ద‌ల‌తో త‌మ ఇష్ట దైవాల‌ను ద‌ర్శించుకుంటున్నారు. అయితే, క‌రోనా నేప‌థ్యంలో ఆల‌యాల్లో తీర్థ‌ప్ర‌సాదాలు, శ‌ఠ‌గోపం ర‌ద్దు చేశారు. అయితే, గుడికి వెళ్ల‌గానే భ‌క్తులు త‌ప్ప‌క చేసే ప‌ని,.. గుళ్లో గంట మోగించ‌టం..మ‌రీ వైర‌స్ వ్యాప్తితో గుడి గంట కొట్టాల‌న్న భ‌క్తులు భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి. ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు గంట‌ను ముట్టుకునే క్ర‌మంలో వైర‌స్ సంక్ర‌మించే ప్ర‌మాదం ఉండ‌టంతో భ‌క్తులు భ‌య‌ప‌డిపోతున్నారు. ఇటువంటి త‌రుణంలో ఓ గుడిలో ఉన్న గంట మాత్రం ఎవ్వరూ కొట్టకుండానే మోగుతోంది. అంటే ఎవరూ మోగించకుండానే మోగుతోంది. ఎవరైనా దాని కిందకు వచ్చి పైకి చెయ్యి చాస్తేనే అది మోగుతుంది. దీంతో అక్క‌డికి వ‌స్తున్న భ‌క్తులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అన్ని దేవాలయాల్లోనూ ఇటువంటి గంటలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

మధ్యప్రదేశ్ లోని మందాసుల్ ప్రాంతంలో ఉన్న పశుపతినాథ్ దేవాలయంలోని గంటను అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎవరూ తాకకుండానే గంట కొట్టుకునే ఏర్పాటు చేశారు. ఈ గంట సెన్సార్ సాయంతో పనిచేస్తుందని అధికారులు తెలిపారు.ఈ కరోనా కాలంలో అధికారులు కాంటాక్ట్ లెస్ గంటను ఏర్పాటు చేయటంతో భక్తులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఆ గంట కింద నిలబడి.. కొడుతున్నట్టు అనుభూతి చెందుతున్నారు భక్తులు. ఈ కాంటాక్ట్ లెస్ గంటను 62ఏళ్ల‌ నారూ ఖాన్ మేవ్ అనే ముస్లిం వయోవృద్ధుడు తయారు చేయడం ఇక్కడ గమనించాల్సిన మరో విశేషం. దీని కోసం తాను ఓ సెన్సార్ ను ఇండోర్ నుంచి తెచ్చామని..రూ. 6 వేలు ఖర్చు పెట్టి, ఆలయంలో గంట దానంతట అదే మోగేలా చేశానని నారూ ఖాన్ మేవ్ తెలిపారు. కాగా, ఇక్క‌డికి వ‌చ్చిన కొంద‌రు భ‌క్తులు దానిని త‌మ కెమెరాల్లో బంధించి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌టంతో కాంటాక్ట్ లెస్ గంట వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu