Bank Timings: కరోనా మహమ్మారి ప్రభావం ఇపట్లో తగ్గేట్లు కనిపింట్లేదు. రోజురోజుకీ దీని ప్రభావం పెరుగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు దేశ వ్యాప్తంగా పెరుగుతూనే ఉన్నాయి. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. కొన్ని సంస్థలు కూడా స్వయంగా తమకు తాము నిబంధనలను విధించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో బ్యాంకు పనివేళల్లో మార్పులు చేశాయి.
ఈ రాష్ట్రంలో గురువారం (ఏప్రిల్ 22) నుంచి మే 15 వరకు రోజుకు కేవలం 4 గంటలు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే బ్యాంకు సేవలు అందుబాటులో ఉండనున్నాయి. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతోన్న నేపథ్యంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ ఈ విషయమై బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక మధ్యాహ్నం రెండు గంటల వరకు కస్టమర్లను అనుమతించగా స్టాఫ్ మాత్రం సాయంత్రం 4 గంటల వరకు ఉండనుంది. ప్రస్తుతానికి మే 15 వరకు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆ తర్వాత కరోనా కేసులు ఆధారంగా పొడగించే అవకాశాలున్నాయని తెలిపారు. ఇక ఈ విషయమై యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ అధికారిక ప్రతినిథి అనిల్ తివారీ మాట్లాడుతూ.. బ్యాంకు ఉద్యోగుల సంరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక నుంచి కేవలం 50 శాతం స్టాఫ్ రొటేషనల్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తారు. ఈ కొత్త విధానం ఏప్రిల్ 22 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో అమల్లోకి వస్తుందని తెలిపారు.
భలే విచిత్రం.. ఈ ప్రాంతంలో ఆయుధాలతో కాకుండా మద్యం సీసాలతో యుద్ధం.. ఎందుకంటే..?