త్వరలోనే దిశ పెట్రోల్స్ .. 900 స్కూట‌ర్లు ఏర్పాటు

| Edited By:

Aug 13, 2020 | 6:21 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని త్వ‌ర‌లోనే దిశ పెట్రోల్స్ ప్రారంభం కాబోతున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దిశ పెట్రోల్‌ ప్రారంభమ‌వుతుంద‌న్నారు. ఈమేర‌కు 900 స్కూటర్లను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సైబర్‌ సేఫ్టీ కోసం కియోస్క్‌లను..

త్వరలోనే దిశ పెట్రోల్స్ .. 900 స్కూట‌ర్లు ఏర్పాటు
Follow us on

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని త్వ‌ర‌లోనే దిశ పెట్రోల్స్ ప్రారంభం కాబోతున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దిశ పెట్రోల్‌ ప్రారంభమ‌వుతుంద‌న్నారు. ఈమేర‌కు 900 స్కూటర్లను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సైబర్‌ సేఫ్టీ కోసం కియోస్క్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఫోన్, ల్యాప్‌టాప్‌ల భద్రతను పరీక్షించుకోవచ్చని అధికారులు తెలిపారు.

ప్రతి పోలీస్‌స్టేషన్‌లో దిశ మహిళా హెల్ప్‌ డెస్క్‌ల ఏర్పాటు చేస్తామ‌న్నారు. అలాగే ప్రత్యేకంగా కంప్యూటర్, ఫోన్‌ నంబర్‌, సైకాలజిస్ట్, ఎన్జీఓ సహా న్యాయ సహాయం కూడా లభిస్తుందన్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కూ దిశ యాప్‌ 11 లక్షల డౌన్‌ లోడ్స్ అయ్యాయ‌ని, దిశ యాప్‌ ద్వారా 502 కాల్స్, 107 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయిన‌ట్లు అధికారులు వివ‌రించారు.

ఇక‌ దిశ చట్టం కింద ఇప్పటి వరకూ 390 కేసులు నమోదవ్వ‌గా, ఈ కేసుల్లో 7 రోజుల్లోపు ఛార్జి షీటు దాఖలు 74 కేసుల్లో శిక్షలు ఖరార‌వ్వ‌గా, మరణశిక్షలు 3, జీవితఖైదు 5, 20 సంవత్సరాల శిక్ష 2, 10 సంవత్సరాల శిక్ష 5, ఏడేళ్లపైన 10, 5 సంవత్సరాలలోపు శిక్షలు, మిగతా కేసుల్లో1130 కేసుల్లో ఛార్జిషీటు దాఖలు చేశామ‌న్నారు. కాగా దిశ ఒన్ స్టాప్ సెంట‌ర్లు పూర్తిస్థాయిలో ప‌ని చేస్తున్నాయ‌న్నారు. 13 జిల్లా హెడ్ క్వార్ట‌ర్స్‌లో ఆ సెంట‌ర్లు పెట్టామ‌న్నారు. జనవరి నుంచి ఆగస్టు వరకూ 2285 కేసులు ఒన్‌స్టాప్‌ సెంటర్లకు వచ్చాయని వివరించారు అధికారులు.

Read More:

కోమాలో మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణబ్ ముఖ‌ర్జీః ఆర్మీ రీసెర్చ్ హాస్పిట‌ల్‌

భార‌త క్రికెట‌ర్‌కి క‌రోనా వైర‌స్ పాజిటివ్‌

అభిరామ్ యాక్సిడెంట్ చేయ‌లేదు.. క్లారిటీ ఇచ్చిన ద‌గ్గుబాటి ఫ్యామిలీ

ఈ రోజు రాత్రి 8 గంట‌ల‌కు మెగా డాట‌ర్‌ నిహారిక నిశ్చితార్థం‌