Andhra Pradesh: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. పెళ్లిళ్లు, సభలు, సమావేశాలకు లిమిట్… అతిక్రమిస్తే

|

Aug 09, 2021 | 6:55 PM

కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.  వివాహాలు, ధార్మిక సభలు,  సమావేశాలకు హాజరయ్యే వారి..

Andhra Pradesh: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. పెళ్లిళ్లు, సభలు, సమావేశాలకు లిమిట్... అతిక్రమిస్తే
Jagan Corona
Follow us on

కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.  వివాహాలు, ధార్మిక సభలు,  సమావేశాలకు హాజరయ్యే వారి సంఖ్యకు పరిధి నిర్దేశిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు  వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.  గరిష్టస్థాయిలో 150 మందికి మాత్రమే ఈ తరహా సమూహ కార్యక్రమాల్లో హాజరయ్యేందుకు అనుమతి ఉందని  ప్రభుత్వం స్పష్టం చేసింది.  సమూహ కార్యక్రమాల సందర్భంగా మాస్కులు ధరించటం, శానిటైజేషన్ లాంటి చర్యలు తప్పనిసరి చేసింది. ఆయా కార్యక్రమాల్లో భౌతిక దూరం ఉండేలా సీట్ల మధ్య ఖాళీ వదలాలని సూచించింది. సీట్లు లేని చోట్ల మనిషికి, మనిషికి మధ్య కనీసం ఐదడుగులు దూరం ఉండేలా చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించింది. సామూహిక కార్యక్రమాల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగితే విపత్తు నిర్వహణా చట్టం కింద, ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నట్టు జగన్ సర్కార్ స్పష్టం చేసింది.

ఏపీలో కరోనా వివరాలు ఇలా ఉన్నాయి..

ఆంధ్రాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 54,455 నమూనాలను పరీక్షించగా 1,413 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,83,721కి చేరింది. తాజాగా 18 మంది కరోనా కారణంగా ప్రాణాలు విడువగా.. మొత్తం మృతుల సంఖ్య 13,549కి పెరిగింది. మరోవైపు.. 1,795 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి కాగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 19,549 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,52,47,884 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. తాజాగా చిత్తూరులో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

Also Read:  ఏపీ టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పిన విద్యాశాఖ మంత్రి.. స్కూల్స్ పున: ప్రారంభంపై కూడా క్లారిటీ

పరమశివుడికి అత్యంత ప్రియమైన నంది విగ్రహాన్నే దొంగిలించిన దుండగులు..